Switch to English

ముందస్తు కొనుగోళ్ళకు తెరలేపుతున్న టీడీపీ, వైసీపీ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇటీవల జరిగిన పోలింగ్‌ తాలూకు ఫలితాలు ఇంకో నెల రోజుల్లో వెల్లడి కానున్నాయి. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. ఈలోగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘గెలిచేది మేమే’ అంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం చూస్తున్నాం. ఓటరు తన తీర్పుని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో నమోదు చేసిన తర్వాత, ఆ ఫలితమేంటో తెలియకుండానే ఆయా పార్టీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం హాస్యాస్పదం.

ఎవరి అంచనాలు వారికి వుండడం తప్పు కాదు. కానీ, ఆ అంచనాల పేరుతో ప్రత్యర్థుల్ని చులకన చేయడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే అవుతుంది. జనసేన ప్రభావంపై తెలుగుదేశం పార్టీకి కొంత బెంగ వున్న మాట వాస్తవం. ఆ బెంగతోనే కొంచెం ఆచి తూచి స్పందిస్తోంది టీడీపీ, జనసేన విషయంలో. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి వేరు. జనసేనను చాలా చులకనగా చూస్తోంది జగన్‌ పార్టీ. జనసేనను మాత్రమే కాదు, టీడీపీ విషయంలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీరు ఇలాగే వుంది.

2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అత్యుత్సాహం ఇలాగే కనిపించింది. ఎన్నికల ఫలితాలొచ్చాక, ‘తక్కువ మార్జిన్‌తోనే ఓడిపోయాం..’ అంటూ తమ ఓటమికి కుంటి సాకులు వెతుక్కుంటూ ప్రధానంగా జనసేన మీద అక్కసు ప్రదర్శించడం చూశాం. బహుశా, ఈసారి ఎన్నికల ఫలితాలు కూడా తమను వెక్కిరిస్తే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడేది జనసేన మీదనే కావొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కాదు, జనసేన మాత్రమే అన్నట్లున్నాయి రాజకీయ సమీకరణాలు.

ఇదిలా వుంటే, అదికార తెలుగుదేశం పార్టీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గెలిచే అభ్యర్థులెవరన్నదానిపై ఆరా తీసి, వారికి గాలం వేసే పనిలో బిజీగా వుందన్న వార్త ఒకటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఫలితాల వెల్లడికి రెండ్రోజుల ముందే తమ పార్టీ అభ్యర్థుల్ని అమరావతికి రావాలంటూ ‘క్యాంపు రాజకీయాలకు’ సన్నాహాలు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఈ క్యాంపులో టీడీపీ అభ్యర్థులే కాదు, కొందరు వైసీపీ అభ్యర్థులు కూడా వుండబోతున్నారని సమాచారమ్‌.

మొన్నటివరకూ టీడీపీలో వుండి, చివరి నిమిషంలో వైసీపీలోకి చేరి, ఆ పార్టీ జెండాతో పోటీ చేసిన 15 నుంచి 20 మంది అభ్యర్థుల వరకు టీడీపీ నిర్వహించబోయే అమరావతి క్యాంపులో దర్శనమిస్తారట. అదే గనుక జరిగితే, అంతకు మించిన స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ‘క్యాంపు’ ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. అయితే వైసీపీ ‘క్యాంపు’ హైద్రాబాద్‌లో వుంటుందని ఆఫ్‌ ది రికార్డ్‌గా వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

‘క్యాంపు’ అంటే కొనుగోళ్ళ సంత అని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? కర్నాటక, తమిళనాడుల్లో ఇలాంటి ‘క్యాంపుల్ని’ ఎక్కువగా చూస్తుంటాం. అప్పుడప్పుడూ తెలుగు రాజకీయాల్లోనూ ఈ క్యాంపుల నిర్వహణలు మామూలే. నేతల్ని కోట్లు వెచ్చించి ఖర్చు చేసి, వారిని తమ వెంట తిప్పుకోవడమే ఈ క్యాంపుల లక్ష్యం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే జనసేన పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులకు కూడా టీడీపీ, వైసీపీ గాలం వేస్తున్నాయట తమ తమ క్యాంపుల్లోకి లాగడానికి.

ఎన్నికల తర్వాత క్యాంపుల్ని చూశాంగానీ, ఎన్నికలకు ముందర ఈ క్యాంపుల ఏర్పాట్లు ఏంటని తలపండిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఎలాగూ మళ్ళీ మలి దఫా కొనుగోళ్ళ వ్యవహారముంటుందనీ, ఈలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కొనుగోళ్ళు తప్పకపోవచ్చునని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...