Switch to English

కేసీఆర్‌కి కాస్త తీరిగ్గా తెల్లారిందంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,476FansLike
57,764FollowersFollow

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షా ఫలితాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్తుపై బెంగతో గగ్గోలు పెడుతోంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీరిగ్గా సమీక్ష నిర్వహించి, కొన్ని ఉపశమనాలైతే ప్రకటించారు. పరీక్ష ఫెయిల్‌ అయినవారికి రీ-వెరిఫికేషన్‌, రీ-వాల్యూయేషన్‌ ఉచితంగా చేయాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు కాస్త ఊరట చెందుతున్నారు.

మొత్తం 19 మంది విద్యార్థులు ఇప్పటికే పరీక్షా ఫలితాల గందరగోళం నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన కేసీఆర్‌, విచారం కూడా వ్యక్తం చేశారు. విద్యార్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నమూ చేశారు. వీలైనంత త్వరగా రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌, రీ-వాల్యూయేషన్‌ ప్రక్రియలు చేపట్టి, పోటీ పరీక్షలకు ఇబ్బంది కలగకుండా చేయాలని కేసీఆర్‌ సూచించడం పట్ల చాలామంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంకాస్త ముందుగా స్పందించి వుంటే, విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. నిజానికి తొలుత అసలు లోపాలే జరగలేదని ఇంటర్మీడియట్‌ బోర్డు బుకాయించింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా విద్యా శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, తప్పులే దొర్లలేదనీ.. చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతంగా చూపిస్తున్నారనీ మీడియాపై మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్‌ చేసిన ‘గ్లోబరీనా’ సంస్థ కూడా తప్పులేం జరగలేదనే బుకాయించడం చూశాం.

తాజాగా ఈ రోజు ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో విషయం మరింత వివాదాస్పదమయ్యేసరికి, కేసీఆర్‌ స్పందించాల్సి వచ్చిందని భావించాలేమో. పొరుగు రాష్ట్రాల్లోనూ, అవసరమైతే పొరుగు దేశాల్లోనూ పరీక్షల నిర్వహణపై పరిశీలన చేయాలనీ, అవసరమైతే ఆ సాంకేతికతను తెలంగాణలోనూ వినియోగించాలని కేసీఆర్‌ సూచించడాన్ని అభినందించాల్సిందే. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. ఈసారి ఇంకాస్త ఎక్కువగా మీడియాలో ఫోకస్‌ అయ్యిందంతే. ఇప్పటిదాకా ఈ విషయంలో ప్రభుత్వమెందుకు చొరవ చూపించలేదన్నది చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్న.

ఇదిలా వుంటే, పాస్‌ అయిన విద్యార్థుల్లోనూ కొందరు ‘లక్కు కొద్దీ’ అదనపు మార్కులు పొందారనీ, ఇందులోనూ చాలా తప్పిదాలు జరిగాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. 99 మార్కులు వచ్చిన విద్యార్థినికి సున్నా మార్కులేసిన ఘనులు, సున్నా మార్కులొచ్చిన విద్యార్థికి 99 మార్కులు వేయలేదని ఎలా అనుకోగలం? తనకు 27 మార్కులు వస్తే ఫెయిల్‌ అని రాశారనీ, 17 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి పాస్‌ అని పేర్కొన్నారని ఓ విద్యార్థి చెబుతున్న విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే.

ఎలా చూసినా, ఈసారి ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వాహణ చాలా అధ్వాన్నంగా జరిగిందనే విషయం అర్థమవుతోంది. అధికారులు, గ్లోబరీనా సంస్థ మాత్రమే కాదు, అధికారంలో వున్నవారు కూడా ఈ తప్పిదానికి బాధ్యత వహించి తీరాల్సిందే. అన్నిటికీ మించి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొత్తంగా 19 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు బాధ్యత వహించి తీరాలనే వాదన విపక్షాల నుంచి వ్యక్తమవుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్ వైరల్

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona Venkat). గతంలో అంజలి నటించిన గీతాంజలి...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...