Switch to English

తెలంగాణపై ఫోకస్‌ పెడుతున్న జనసేనాని.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్‌ పెట్టిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల విషయంలో మాత్రం ‘మమ’ అనిపించేశారు. హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి జనసేనాని ఓ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెల్సిందే. అయినప్పటికీ తెలంగాణలో జనసేన నేతలు అంత యాక్టివ్‌గా కనిపించడంలేదు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ వంటి పార్టీలే తెలంగాణలో గట్టిగా గళం విప్పడానికి జంకుతున్న ఈ పరిస్థితుల్లో జనసేనాని, తెలంగాణపై ఫోకస్‌ పెట్టాలనే నిర్ణయానికి రావడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అచేతనావస్థలోకి వెళ్ళిపోయింది. అయితే, జనసేన మాత్రం ధైర్యంగా నిలబడింది. జనసేన అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రజానీకంలోనూ జనసేన ధైర్యం పట్ల పాజిటివ్‌ స్పందన కనిపించింది. విజయావకాశాల గురించి ఆలోచించకుండా, పోరాటంలో తొలి అడుగు వేసిన జనసేనాని, తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ బోర్డు నిర్వాకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. పవన్‌కళ్యాణ్‌ పేరుతో జనసేన పార్టీ ఓ లేఖ విడుదల చేసింది ఈ రోజు.

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, లేఖాస్త్రంతో హెచ్చరించిన విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనానికి ఎంతటి అభిమాన గణం వుందో, అంతకు మించిన అభిమానగణం తెలంగాణలోనూ వుంది. అది కేవలం సినీ అభిమానమే కాదు, దాన్ని రాజకీయ అభిమానంగానూ మార్చుకోవాలన్న ఆలోచనతో వున్న జనసేన పార్టీకి ఇది కలిసొచ్చిన సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

జనసేనాని గనుక ప్రత్యక్షంగా రంగంలోకి దిగి, బాధిత విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయగలిగితే, తెలంగాణలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా నిలబడేందుకు అవకాశాలు పెరుగుతాయి. మొత్తంగా ఈ రోజు వరకు 19 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలకు దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందే, ఆత్మ బలిదానాల పునాదుల మీదనన్న అభిప్రాయం ఒకటి బలంగా తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయింది. ఆ ఆత్మబలిదానాల్ని రాజకీయంగా వాడుకుని, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం.

అయితే, దురదృష్టవశాత్తూ విద్యార్థుల ఆత్మబలిదానాల్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. విద్యా శాఖ మంత్రి విద్యార్థుల ఆత్మహత్యల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆందోళ కలిగిస్తున్నాయి. ‘ఎప్పటినుంచో పరీక్షలు జరుగుతున్నాయి.. పాస్‌ అవడం, ఫెయిల్‌ అవడం మామూలే.. విద్యార్థుల ఆత్మహత్యలూ కొత్తేమీ కాదు..’ అని విద్యా శాఖ మంత్రి చెప్పడం శోచనీయమే.

ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాలి. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కి సంబంధించి ఫీజు లేకుండా చేయాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన డిమాండ్‌ పట్ల బాధిత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా పవన్‌ తమకు అండగా నిలిచి, తమ తరఫున వాయిస్‌ వినిపించాలనీ, ప్రభుత్వాన్ని నిలదీయాలనీ కోరుతున్నారు. చాలా సెన్సిటివ్‌ విషయమిది. రాజకీయ కోణంలో కాకపోయినా, విద్యార్థుల కోసం జనసేనాని ఉద్యమ బాట పట్టాల్సిందేనేమో!

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ కోసమంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేసిన ఓ సినీ ప్రముఖుడు, ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీలో చేరి నానా యాగీ చేశారు ఎన్నికల సమయంలో. ఆయనిప్పుడు తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై పెదవి విప్పకపోవడమేంటో? విద్యా సంస్థలకు అధిపతి అయిన ఆ సినీ ప్రముఖుడు, వుంటున్నది తెలంగాణలోనే కదా!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...