Switch to English

స్థానిక పోరు: నిమ్మగడ్డ వర్సెస్‌ జగన్‌ సర్కార్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

అదే పోరు.. రాజకీయ పార్టీల మధ్య జరగాల్సిన ‘రచ్చ’ కాస్తా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కీ, రాష్ట్ర ముఖ్యమంత్రికీ మధ్య జరుగుతోందన్నట్లు తయారైంది పరిస్థితి. ‘చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే..’ అంటూ కొన్నాళ్ళ క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై అధికారికంగానే సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నిమ్మగడ్డను తొలగించడం, హైకోర్టు జోక్యంతో తిరిగి నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అవడం తెలిసిన విషయాలే.

కరోనా ప్రమాదాన్ని ముందే ఊహించిన నిమ్మగడ్డ, స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తే.. దానికి వైసీపీ తీసిన వక్రభాష్యాలు అన్నీ ఇన్నీ కావు. అదంతా గతం. ప్రస్తుతానికొస్తే, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించడంలేదని నిమ్మగడ్డ, హైకోర్టును ఆశ్రయించారు. నిధుల విషయంలోనూ, ఇతరత్రా విషయాల్లోనూ ప్రభుత్వ సహకారం కొరవడిందన్నది నిమ్మగడ్డ ఆరోపణ.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని సూచించింది. దీనికోసం ప్రత్యేకంగా ఆర్డర్స్‌ అవసరం లేదని తెలిపింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిన మేర నిధుల్ని విడుదల చేయడానికి అభ్యంతరమేమీ లేదనీ, ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేయడం జరిగిందనీ న్యాయస్థానానికి తెలిపింది.

మరోపక్క, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హయాంలో స్థానిక ఎన్నికల నిర్వహణ మాత్రం ప్రభుత్వ పెద్దలకు సుతారమూ ఇష్టం లేదు. దాంతో, ప్రక్రియను ఎలాగోలా వాయిదా వేయించాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. మరోపక్క, కరోనా జోరు తగ్గడం.. అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతుండడంతో స్థానిక ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ప్రతి విషయానికీ ఎన్నికల కమిషనర్‌ హైకోర్టుకు వచ్చే పరిస్థితి వుండకూడదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సి వుంటుంది..’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి చెంప పెట్టు.. అనే విమర్శ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. కాగా, స్థానిక ఎన్నికల నేపథ్యంలో అత్యంత జుగుప్సాకరమైన రీతిలో అధికార పార్టీ దాడులకు తెగబడిందనీ, ఈ నేపథ్యంలో ఏకగ్రీవమైన స్థానాల్లోనూ తిరిగి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...