Switch to English

చెరగని, చెదరని చిరునవ్వుకి నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చెరగని చిరునవ్వుకి ఆయన కేరాఫ్‌ అడ్రస్‌. ప్రత్యర్థుల్ని విమర్శించడానికి కూడా ఆయన ఆ చిరునవ్వే ఉపయోగిస్తుంటారు. సుతిమెత్తగా విమర్శించడంలో బహుశా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సాటి ఇంకెవరూ రారేమో. ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాకు చాలా మంచి మిత్రుడు..’ అని రాజశేఖర్‌రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారంటే.. వైఎస్సార్‌ ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. అలాంటి విమర్శల్ని రాజశేఖర్‌రెడ్డి కూడా చాలానే ఎదుర్కొన్నారు. ఆ సంగతి పక్కన పెడితే, ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయి.. ఏళ్ళు గడుస్తున్నాయి. ‘అప్పుడే పదేళ్ళయిపోయిందా.?’ అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ, తెలుగునాట రాజకీయాలపై వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ‘అంతా నిన్న మొన్న జరిగినట్లే వుంటుంది’ అంటే, అది ఆయన ప్రత్యేకత అనుకోవాలేమో.

ఆనాటి వైఎస్సార్‌ వీడియోలు ఇప్పుడు చూస్తోంటే, ‘ఇంకా ఆయన జీవించే వున్నారేమో..’ అన్న భావన కలగక మానదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ముందు కూడా చాలామంది సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. కానీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకత వేరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌.. ఈ రెండూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెరపైకి వచ్చిన పథకాలు. వీటిని కేవలం ఓటు బ్యాంకు సంక్షేమ పథకాలుగా చూడలేం. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఈ రెండు సంక్షేమ పథకాలూ తెలుగునాట అమల్లోనే వుంటాయి. వాటి ప్రత్యేకత అలాంటిది మరి.

జలయజ్ఞం సహా ఇతర ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై వున్నట్లుగానే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీపైనా భిన్నాభిప్రాయాలు, విమర్శలు వుండొచ్చుగాక. కానీ, వైఎస్సార్‌ మరణం తర్వాత కూడా ఆరోగ్యశ్రీ, ఫీజు-రీఎంబర్స్‌మెంట్‌.. మరింత ప్రత్యేకంగా అమలవుతున్నాయంటే.. వాటి ప్రాధాన్యత ఏపాటిదో అర్థమవుతుంది. రెండోసారి అధికారంలోకి వస్తూనే, ‘మాకు ప్రజలు ఫుల్‌ మార్కులు ఇవ్వలేదు.. జస్ట్‌ పాస్‌ మార్కులు మాత్రమే ఇచ్చారు. అంటే, మేం చేరాలనుకున్న స్థాయిలో ప్రజల్ని చేరుకోలేకపోయామన్నమాట. ఈసారి ఇంకా జాగ్రత్తగా పరిపాలన చేయాల్సి వుంది..’ అని వైఎస్సార్‌ వ్యాఖ్యానించారు.

దురదృష్టవశాత్తూ రెండోసారి అధికారంలోకి వచ్చాక అతి తక్కువ సమయంలోనే హెలికాప్టర్‌ ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ‘వైఎస్సార్‌ వుండి వుంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయేది కాదేమో..’ అని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు. కాదు, ఆయనే ఈ విభజనకు బీజం వేశారని ఇంకొందరు అంటారు. ఏదిఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ ఓ శకం. ఆయన వర్ధంతి సందర్భంగా జోహార్‌ వైఎస్సార్‌.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...