Switch to English

అప్పుడు యెల్లో.. ఇప్పుడు బ్లూ.. ప్రకటనల తీరు మారదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

టీడీపీ హయాంలో పసుపు రంగుతో కూడిన ప్రకటనల్ని చూశాం. ‘పసుపు శుభప్రదం’ అంటూ తమ ‘పచ్చ పబ్లిసిటీ స్టంట్స్‌’కి తమదైన నిర్వచనాన్ని ఇచ్చారు అప్పట్లో టీడీపీ నేతలు. అధికారం టీడీపీ నుంచి వైసీపీకి వచ్చింది. దాంతో, ఇప్పుడు ప్రకటనల్లో ఎక్కువగా ‘బ్లూ కలర్‌’ కన్పిస్తోంది. టీడీపీది ఒకటే రంగు.. అదే పసుపు. వైసీపీకి అలా కాదు కదా. పసుపుతోపాటు తెలుపు, గ్రీన్‌ కలర్‌ కూడా వున్నాయి. అందుకే, ఇంకాస్త ముందడుగు వేసి.. ప్రభుత్వ కార్యాలయాలకీ తమ పార్టీ రంగులు వేసేసుకుంది వైసీపీ ప్రభుత్వం. కోర్టు చీవాట్లతో ఆ ప్రక్రియ ఆగినా, కొన్ని చోట్ల ఇంకా ఆ రంగుల పైత్యం కన్పిస్తూనే వుంది.

ఇక, అసలు విషయానికొస్తే.. ప్రభుత్వ ప్రకటనల్లో వైసీపీ జెండా రంగులు, వైఎస్‌ జగన్‌ ఫొటోలతోపాటు మంత్రుల ఫొటోలు, వైఎస్‌ జగన్‌ తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఫొటోలను ఆక్షేపిస్తూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. ‘అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు.. రాజకీయ ప్రయోజన వ్యాజ్యం’ అని ప్రభుత్వం తరఫున న్యాయవాది తమ వాదన విన్పించారు.

‘ముఖ్యమంత్రి ఫొటోతోపాటు మంత్రుల ఫొటోలు వుండకూడదని రూల్‌ ఏమీ లేదు కదా.! వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫొటో వుంటే తప్పేంటి.?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇది నిజంగానే అధికార పార్టీకి పెద్ద ఊరట. ప్రతిసారీ న్యాయస్థానం నుంచి మొట్టికాయలు ఎదురవుతుండడంతో, న్యాయస్థానాలపైనా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన బులుగు బ్యాచ్‌.. ‘చూశారా.. న్యాయం మా వైపే వుంది..’ అంటూ రెచ్చిపోతోందిప్పుడు సోషల్‌ మీడియాలో.

అయితే, ఈ రంగులపైనా, ఫొటోలపైనా దాఖలైన పిటిషన్‌ని వేరే ధర్మాసనానికి బదిలీచేసింది తప్ప.. న్యాయస్థానం కొట్టిపారేయలేదు. పైగా, న్యాయమూర్తి ‘వ్యక్తిగతంగా తాను ఈ తరహా ఫొటోల పబ్లిసిటీని సమర్థించను..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇది నైతికతకు సంబంధించిన అంశం. ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది ప్రజాధనం. ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జవాబుదారీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలు, తమ సొంత పబ్లిసిటీ కోసం, తమ పార్టీ పబ్లిసిటీ కోసం ఉపయోగిస్తుండడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. చంద్రబాబు హయాంలో జరిగిందీ తప్పే.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో జరుగుతున్నదీ తప్పే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...