Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి – యాసే కాదు, కథ కూడా మారాలి.!

Critic Rating
( 1.50 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి
Star Cast మున్నా, దృషిక చందర్, రవివర్మ, సుబ్బారావు
Director కృష్ణ పోలూరు
Producer పామిడిముక్కల చంద్ర కుమారి
Music మహిరాంశ్
Run Time 2 గంటల 2 నిమిషాలు
Release ఆగష్టు 21, 2020

నూతన నటీనటులు మున్నా, దృషిక చందర్ హీరో హీరోయిన్లుగా కృష్ణ పోలూరు దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’. లాక్ డౌన్ కి ముందే ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటికీ థియేటర్స్ లేని కారణంగా కొద్ది నెలలు వెయిట్ చేసి ఫైనల్ గా ఓటిటి బాట పట్టిన సినిమాల్లో ఇదీ ఒకటి. నేడు ఆహా లో డైరెక్ట్ గా రిలీజైన ఈ విలేజ్ లైవ్ స్టోరీ ఎంత వరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలోని క్లైమాక్స్ డైలాగ్స్ తో సినిమా మొదలు పెట్టి, అలా తొలిప్రేమ సినిమా ఆడుతున్న హాల్లో నుంచి మన హీరో బాలు(మున్నా) ప్రేమకథ మొదలవుతుంది.. ఆ ఊరి పేరు బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి… తన క్లాస్ మేట్ మరియు ఎదురింటి అమ్మాయి అయిన స్వప్న(దృషిక చందర్)ని ప్రేమిస్తుంటాడు. కానీ స్వప్న వాళ్ళ నాన్న అన్నిటికన్నా కులమే ముఖ్యం అనే మనస్తత్వం కలవాడు. అనుకున్నట్టే బాలు – స్వప్న ప్రేమలో పడతారు. పెద్దలు ఒప్పుకోని పరిస్థితి.. దాంతో లేచిపోతారు. ఇక అక్కడి నుంచి వారి ప్రేమ కథ ఏమైంది? కలిసే ఉన్నారా లేక విడకొట్టరా? పరువు కోసం ప్రాణం తీసే మనస్తత్వం ఉన్న స్వప్న వాళ్ళ నాన్న ఆ ప్రేమికులని ఏం చేశారు అనేదే కథ..

తెర మీద స్టార్స్..

మున్నా – దృషిక చందర్ లు హీరో హీరోయిన్లుగా కొన్ని ఎపిసోడ్స్ లో మంచి నటనని కనబరిచారు. ముఖ్యంగా చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ లో చాలా బాగా చేశారు. మున్నా ఎమోషనల్ సీన్స్ లో ఇంకా బెటర్ చేసి ఉంటే బాగుండేది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ సుబ్బారావు ఫాదర్ పాత్రలో చాలా బాగా చేయడం వలన ఒకటి రెండు సీన్స్ లో ఎమోషనల్ ఫీల్ వస్తుంది. చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ లో హీరోకి, హీరోయిన్ కి ఫ్రెండ్స్ గా నటించిన ఇద్దరు లంబు – జంబులు(బొద్దుగా ఉన్న అబ్బాయి – అమ్మాయి) అక్కడక్కడా నవ్విస్తారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల వరకూ న్యాయం చేశారు.

తెర వెనుక టాలెంట్..

ఈ సినిమా చూస్తున్నంత సేపు కళ్ళకి నేత్రానందం, చెవులకు శ్రవణానందం ఉంటుంది.. అనగా డీఓపీ రామ్ మహేషన్ పల్లెటూరిని, సింపుల్ లొకేషన్స్ అయినా వాటిని చూపించిన విధానం సూపర్బ్.. ఆ విజువల్స్ కి ప్రాణం పోసేలా మిహిరాంశ్ పాటలు, నేపధ్య సంగీతమే అందించారు. ఈ రెండు ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది కెప్టెన్ అఫ్ ది షిప్ కృష్ణ పోలూరు గురించి.. కథ పరంగా పెద్ద విషయం లేదు.. ఇద్దరి మధ్య ప్రేమ.. దానికి కులం అడ్డు.. పారిపోవడం, చంపుకోవడం.. ఇలా రొటీన్ పాత చింతకాయపచ్చడి స్టోరీ.. పోనీ అలాంటికథకి కథనం అన్నా ఆసక్తిగా ఉందా అంటే అదీ లేదు.. చాలా నిధానంగా సాగుతూ చూసే వారిని నిదురపుచ్చేలా సాగుతుంది. డైరెక్టర్ గా అనుకున్న ఎమోషన్ తో అయినా కట్టిపడేశాడా? ప్రేమలో ఎడబాటుతో ఏడిపించాడా? అంటే అదీ లేదు.. ప్రేమ కథలో ఉండాల్సిన ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా చూపించకపోవడం వలనే బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ కథా పరంగా ఎంచుకున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ వలన అక్కడి యాసలో రాసుకున్న డైలాగ్స్ మాత్రం కాస్త రొటీన్ కి భిన్నంగా అనిపించడం వలన బాగున్నాయి. డైరెక్టర్ మొదటి నుంచి హీరోయిన్ ఫాదర్ పాత్రలో కుల పిచ్చి ఈ రేంజ్ లో ఉంటుందా? అనేలా ఎలివేట్ చేసి.. ఎందుకు? ఏమిటి? ఎలా? అనేది లేకుండా క్లైమాక్స్ లో పాత్రని ఎందుకు మార్చేశాడా అనేది ఓ మిలియన్ డాలర్ ప్రశ్న.

ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ చాలా కట్ చేస్తేనే 2 గంటల సినిమా అయ్యింది.. ఇంకో 30 నిమిషాలు కోసేసినా సినిమా ఫీల్ లో పెద్ద మార్పు ఉండదు. దాన్నిబట్టి ఎడిట్ లో ఎంత లాగ్ ఉందో మీరు ఊహించవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– వండర్ఫుల్ విజువల్స్
– సూపర్బ్ మ్యూజిక్
– నేటివిటీ అండ్ చైల్డ్ హుడ్ ఎపిసోడ్

బోరింగ్ మోమెంట్స్:

– తరతరాల నుంచీ వస్తున్న అదే ప్రేమ కథ
– నీరసం తెప్పించే కథనం
– ఆకట్టుకొని ఎమోషన్
– 2 గంటల నిడివి
– ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
– సహనాన్ని పరీక్షించే సెకండాఫ్

విశ్లేషణ:

ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు చూసేసిన ఓ విలేజ్ ప్రేమకథని ఈ సారి చిత్తూరు యాసలో చేసిన సినిమానే ఈ ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’. ఆ యాస తప్ప కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, చూసి ఎంటర్టైన్ అవ్వడానికి, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి కూడా ఏమీ లేని ఈ సినిమాని చూడడం కష్టం, అలాంటిది చివరి దాకా చూడడం చాలా చాలా కష్టం సుమీ..

చూడాలా? వద్దా?: లైట్ తీస్కోండి..!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5 

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...