Switch to English

బిగ్ బ్రేకింగ్: కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారికి చెక్ చెప్పేందుకు తొలి వ్యాక్సిన్ వచ్చేసింది. ఆగస్టులో వ్యాక్సిన్ విడుదల చేస్తామని చెప్పిన రష్యా.. అది చేసి చూపించింది. వాస్తవానికి బుధవారం దీనిని విడుదల చేస్తామని రష్యా ఆరోగ్యశాఖ సోమవారం ధ్రువీకరించినా.. ఒకరోజు ముందే వ్యాక్సిన్ ను విడుదల చేసినట్టు రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తమదేనని పేర్కొన్నారు.

గమ్ కోవిడ్ వ్యాక్ లయో పేరుతో గమలేయా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తో కలసి రష్యా రక్షణ శాఖ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. తొలుత వైద్యులు, ఉపాధ్యాయులకు ఈ టీకా అందించనున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా పౌరులందరికీ టీకా ఇవ్వనున్నారు. మూడు దశల్లో ప్రయోగాలు పూర్తయిన తర్వాత ఇది సమర్థంగా పనిచేస్తన్నట్టు నిర్ధారణకు వచ్చారు. తొలి డోస్ వేసిన తర్వాత 21 రోజులకు శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతమైందని, రెండో డోస్ తో ఇది మరింత శక్తివంతమైందని పేర్కొంటున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తె సహా పలువురికి టీకా వేశారు. వచ్చే నెలలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించి, నవంబర్ కల్లా దేశంలో అందరికీ టీకా వేయాలని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే విషయంలో పలు దేశాలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రేసులో ముందు ఉండటం కోసం రష్యా శతవిధాలా ప్రయత్నించింది. ఇందుకోసం ట్రయల్స్ కాల వ్యవధిని కూడా తగ్గించాలని పుతిన్ ఆదేశించారు. అయితే, అది మంచిది కాదని.. హడావుడిగా చేసే పరిశోధనల వల్ల ఫలితం ఉండదని అమెరికా వ్యాఖ్యానించింది.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం రష్యా టీకాపై ఆందోళన వ్యక్తంచేసింది. టీకా తయారీలో తాము సూచించిన మార్గదర్శకాలన్నీ పాటించాలని సూచించింది. ప్రస్తుతం రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ సరిగ్గా పనిచేస్తే ప్రపంచానికి ఆ దేశం పెద్ద ఆశాకిరణమే. అయితే, రేసులో ముందు ఉండటం కోసం హడావుడిగా టీకా తీసుకొచ్చామని ప్రకటిస్తే మాత్రం దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. త్వరలోనే పలువురికి ఈ టీకా ఇవ్వనున్న నేపథ్యంలో దాని పనితీరు ఎలా ఉందనే విషయం తెలుస్తుంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...