Switch to English

బాబోరి కామెడీ: అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్‌ అట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ‘అమరావతి ప్రాజెక్ట్‌’ని సెల్ఫ్ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తున్నారు. కొత్త కథ ఏమీ కాదిది. తాను అధికారంలో వున్నప్పుడూ, అధికారం పోయాకా.. ఆయన ఇదే మాట కుండబద్దలుగొట్టేశారు.. కొట్టేస్తూనే వున్నారు.

బాబోరి ప్రచారం బాగానే వుందిగానీ, అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్‌ అంటే ఏంటి.? తనంతట తానుగా నిధుల్ని సమకూర్చుకోవడమన్నమాట.! మరి, కేంద్రం ఎందుకు అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలి.? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపట్టాలి.? ఏ సింగపూరో, జపానో, చైనానో.. ఇంకొక దేశానికి చెందిన సంస్థలో అప్పనంగా అమరావతిని చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కట్టేసి పోవాలి కదా.! అలాగే ప్లాన్‌ చేశారు చంద్రబాబు కూడా.! కానీ, ఇక్కడో చిన్న మార్పు. సీఆర్డీయే నుంచి కొన్ని అధికారాల్ని సింగపూర్‌ కన్సార్టియంకి బదిలీ చేయడం జరిగింది అప్పట్లో. అదో పెను వివాదంగా మారింది. ఆలోచన వాళ్ళది.. భూములు మనవి.. వాటి మీద సంపాదన హక్కుల్లో మళ్ళీ వాళ్ళకి వాటాలు దక్కుతాయ్‌. ప్రాజెక్ట్‌ డిజైనింగ్‌ అదిరిపోయింది కదూ.! ఇలాంటి మ్యాజిక్కులు చంద్రబాబు చాలానే చేయాలనుకున్నారు.. కానీ, కుదరలేదు.

ఇక, రాజధానిగా అమరావతిని ప్రకటించే ముందే టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. ఆ మాటకొస్తే, టీడీపీ నేతలు తమకు సన్నిహితులైన ఇతర పార్టీల నేతలకూ లీకులు ఇచ్చేయడంతో.. అందరూ బాగానే జాగ్రత్తపడిపోయారు. కాస్త ఎక్కువగా లాభం పొందింది టీడీపీ నేతలే. మొత్తంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ మూల నుంచి ఈ మూలదాకా భూములు చాలావరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లోకి వెళ్ళిపోయాయి. చిత్రంగా ఆ మొత్తం వ్యవహారంపై ప్రస్తుత వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కూడా సీరియస్‌గా ఫోకస్‌ పెట్టడంలేదు.

అమరావతి మాత్రమే కాదు, దాని చుట్టూ వున్న భూములకు సంబంధించిన లావాదేవీల లెక్కలు తీస్తే, రాజకీయ నాయకులకు అమరావతి అనేది ఎంత ‘గొప్ప ఫైనాన్సింగ్‌’ ప్రాజెక్టుగా ఉపయోగపడిందో అర్థమవుతుంది. 10 లక్షలు పలికే ఎకరం భూమి ధర ఏకంగా 10 కోట్లకు ఎగబాకింది అప్పట్లో. అంత పెద్ద మొత్తంలో సామాన్యులు భూముల్ని కొనే అవకాశం లేదు కదా.! బడా బాబులు.. అందునా రాజకీయ నాయకులే పండగ చేసుకున్నారు. ఏడాది కాలంలో ఒక్కరంటే ఒక్క ‘బడా నాయకుడు’ కూడా ఈ భూముల కుంభకోణానికి సంబంధించి జైలు ఊచలు లెక్కెట్టిన పరిస్థితి లేదు. అదీ వైసీపీ చిత్తశుద్ధి.టీడీపీ సంగతంటారా.. ‘ఫైనాన్సింగ్‌’ స్కీమ్ కి తెరలేపిందే టీడీపీ కదా.!

అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అమరావతిని రాజధానిగా చేశామని చంద్రబాబు ఈ రోజు తాజాగా సెలవిచ్చారు. ఎలగెలగ.? విశాఖను అందుకేనా పక్కన పడేసింది.? అభివృద్ధి వికేంద్రీకరణ అన్న మాటకి అర్థం తెలుసా.? అని క్వశ్చన్‌ చేయాల్సి వస్తోందిప్పుడు ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబుని.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...