Switch to English

‘కరోనా రాజకీయం’.. ఇంత దుర్మార్గమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మొన్నామధ్య హైకోర్టు న్యాయమూర్తుల మీద వైసీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైనం పెను ప్రకంపనలు సృష్టించింది. హైకోర్టు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కరోనా వార్డులో న్యాయమూర్తుల్ని పడెయ్యాలి..’ అంటూ సదరు వైసీపీ మద్దతుదారులు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి. పగవాడికి కూడా అది సోకకూడదనే కోరుకోవాలి ఎవరైనా. దురదృష్టవశాత్తూ అది కొందరికి కామెడీ అయిపోయింది.

ఇటీవలే మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ‘అమరావతికి బీజేపీ అన్యాయం చేసింది.. అందుకే.. పాపం పండింది.. బీజేపీ నేత కరోనాతో చనిపోయారు..’ అంటూ టీడీపీ మద్దతుదారులు కొందరు సోషల్‌ మీడియాలో జుగుప్సాకరమైన కామెంట్స్‌ పోస్ట్‌ చేశారు.

తాజాగా, కేంద్ర మంత్రి అమిత్‌ షా కరోనా వైరస్‌ బారిన పడితే.. ఆయనపైనా ఇదే తరహా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు. ఇదా పద్థతి.? ఇదా రాజకీయం.? పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారిన పడితే, ఆయన త్వరగా కోలుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలూ ఆకాంక్షించారు. ఆయన కరోనా కారణంగా మృతి చెందితే, అన్ని పార్టీలకు చెందిన నేతలూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మరి, ఈ సోకాల్డ్‌ పొలిటికల్‌ నెటిజన్లకు ఏమయ్యింది.? ‘మీ వెనకాల మేమున్నాం.. మీరెలాగైనా వ్యవహరించొచ్చు..’ అని మొన్నీమధ్యనే ఓ పార్టీకి చెందిన ముఖ్య నేత, తమ మద్దతుదారులైన నెటిజన్లకు భరోసా ఇచ్చిన వైనాన్ని చూశాం. అది హైకోర్టు న్యాయమూర్తులపై జుగుప్సాకరమైన కామెంట్ల వివాదానికి సంబంధించినది. నేతలు ఇలా వుంటే, వారి మద్దతుదారులు ఇంతకన్నా దారుణంగానే వుంటారు మరి.

ఇక, టీడీపీ మద్దతుదారులైన నెటిజన్ల తీరుపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ తన ఉనినికి కోల్పోతోందనీ, ఈ నేపథ్యంలో అక్కసుని ఇలా వెల్లగక్కుకుంటోందనీ విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ‘పేటీఎం’ గాళ్ళు, ‘జీ-పే’ గాళ్ళు సోషల్‌ మీడియాలో ఆయా పార్టీల తరఫున నియమితులవడం వల్లే ఈ దుష్ట సంస్కృతి రోజురోజుకీ విస్తరించేస్తోందన్నది నిర్వివాదాంశం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...