Switch to English

నిమ్మగడ్డ రీ-ఎంట్రీ.. అసలు సిసలు విక్టరీ అంటే ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. నిన్న అర్థరాత్రి దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

నిమ్మగడ్డ పునర్‌నియామకంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అస్సలేమాత్రం ఇష్టం లేదన్నది ఓపెన్‌ సీక్రెట్‌. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పనిచేస్తున్నప్పుడే ఆయనపై ‘సామాజిక వర్గం’ పేరుతో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అత్యంత వ్యూహాత్మకంగ నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో కనగరాజ్‌ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన విషయం విదితమే.

హైకోర్టు మొట్టికాయలతోనూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ వైఖరి మారలేదు. అడ్వొకేట్‌ జనరల్‌ని తీసుకొచ్చి మరీ హైకోర్టు తీర్పుకి ‘వేరే భాష్యాలు’ చెప్పించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. మరోపక్క, ఈ విషయమై సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి వరుసగా అక్కడా చుక్కెదురయ్యింది. నేటితో డెడ్‌లైన్‌ కావడంతో.. నిన్న అర్థరాత్రి వరకూ వేచి చూసి, రాత్రికి రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ‘సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి..’ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. అంటే, సుప్రీం కోర్టు గనుక వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. మళ్ళీ వెంటనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన పదవిని కోల్పోతారేమో.!

మిగతా విషయాలెలా వున్నా, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. న్యాయపోరాటంలో ఇప్పటికే గెలిచేశారు. తన మీద నానా రకాల జుగుప్సాకరమైన ఆరోపణల్ని అధికార పార్టీ నేతలు, పైగా బాధ్యతాయుతమైన పదవుల్లో వున్నవారు చేసినా.. పోరాటంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఇక, ప్రభుత్వ ఉత్తర్వులతో ఏ క్షణాన అయినా నిమ్మగడ్డ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

అన్నట్టు, నిమ్మగడ్డ గనుక తిరిగి ఎన్నికల కమిషనర్‌గా ఎంపికైతే.. సోషల్‌ మీడియాని వదిలేస్తామని కొందరు.. రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఇంకొందరు వైసీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు, అభిమానులు శపథాలు చేసేశారు. మరి, నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చేసింది.. ఇంకెందుకు ఆలస్యం.. ‘శపథాలు’ చేసినవారంతా మాట నిలబెట్టుకుంటే సరి.!

7 COMMENTS

  1. 🚀 Wow, blog ini seperti perjalanan kosmik meluncurkan ke alam semesta dari kemungkinan tak terbatas! 🎢 Konten yang mengagumkan di sini adalah perjalanan rollercoaster yang mendebarkan bagi imajinasi, memicu ketertarikan setiap saat. 💫 Baik itu teknologi, blog ini adalah harta karun wawasan yang mendebarkan! 🌟 Berangkat ke dalam perjalanan kosmik ini dari imajinasi dan biarkan pikiran Anda melayang! ✨ Jangan hanya membaca, alami sensasi ini! #MelampauiBiasa Pikiran Anda akan berterima kasih untuk perjalanan menyenangkan ini melalui ranah keajaiban yang penuh penemuan! 🌍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...