Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: శకుంతల దేవి – హ్యాపీ అండ్ ఎమోషనల్ రైడ్.!

Critic Rating
( 3.00 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow
Movie శకుంతల దేవి
Star Cast విద్యాబాలన్, జిష్షు షేన్ గుప్త, సన్య మల్హోత్రా, అమిత్ సాద్
Director అను మీనన్
Producer సోనీ పిక్చర్స్, విక్రమ్ మల్హోత్రా
Music సచిన్ - జిగర్, కరణ్ కులకర్ణి
Run Time 2 గంటల 07 నిముషాలు
Release జూలై 31, 2020

మాథ్స్ అందరికీ చాలా టఫ్ అనిపించే సబ్జెక్ట్.. కానీ ఆవిడకి మాత్రం వెన్నతో పెట్టిన విద్య..ఆవిడే ‘హ్యూమన్ కంప్యూటర్’ అని పిలుచుకునే శకుంతల దేవి. గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శకుంతల దేవి జీవిత కథతో రూపొందించిన బయోపిక్ ‘శకుంతల దేవి’. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్స్ ని మిస్ చేసి నేడు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా డిజిటల్ వరల్డ్ లో రిలీజ్ అయ్యింది. మరి అంకెలతో మేజిక్ చేయగలిగిన శకుంతల దేవి బయోపిక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఓపెన్ చేస్తే శకుంతల దేవి(విద్యాబాలన్) కుమార్తె అనుపమ బెనర్జీ(సన్య మల్హోత్రా) తన తల్లిమీదే క్రిమినల్ కేసు పెడుతుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. బెంగుళూరులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శకుంతల దేవి స్కూల్ కి కూడా వెళ్ళదు కానీ తన 3వ ఏటనే తను అంకెలతో మేజిక్ చేయగలదని తెలుస్తుంది. దాంతో శకుంతల దేవి నాన్న తనతో పలు మాథమెటికల్ షోస్ చేయిస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. ఆ టైములో తనకి ఇష్టమైన అక్కయ్య చనిపోవడం, దానికి కారణం తన తల్లింతండ్రులే అని భావించి వారి మీద కోపంతో లండన్ వెళ్ళిపోతుంది. అక్కడ పలువురు సాయంతో వరల్డ్ ఫెమస్ హ్యూమన్ కంప్యూటర్ గా పేరు సంపాదించడమే కాకుండా ఎంతో ఆస్తి సంపాదిస్తుంది. ఓ కూతురు పుట్టాక తను కూడా తనలానే అవ్వాలని, తనతోనే ఉండాలని అనుకుంటుంది. దాంతో ఇద్దరి మధ్య ఎమోషనల్ వార్ మొదలవుతుంది. ఇక అక్కడినుంచి శకుంతల దేవి లైఫ్ లో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? ఈ సమస్యల వలన మాథ్స్ లో ఎప్పుడూ గెలిచే శకుంతల దేవి ఓడిందా? అలాగే సొంత కుమార్తె తన మీద క్రిమినల్ కేసు ఎందుకు పెట్టింది? జీవితంలో శకుంతలదేవి చేసిన అతిపెద్ద తప్పేంటి? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన కథ.

తెర మీద స్టార్స్..

తెరపై కనిపించిన ప్రతి ఒక్కరూ వారెవ్వా అనుకునేలా నటించారు. అందరికంటే అగ్ర తాంబూలం ఇవ్వాల్సింది మాత్రం విద్యాబాలన్ కి, అంతే కాకుండా అద్భుతమైన నటనని కనబరిచి, శకుంతల దేవి పాత్రలో నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. వాహ్.. తన లుక్, వేష ధారణ, బిహేవియర్ ఇలా ప్రతి ఒక్క దానిలోనూ శకుంతల దేవిని తలపించేసింది. అలాగే హాస్యం, కోపం, బలుపు మరియు ఎమోషనల్ ఇలా అన్ని షేడ్స్ ని వాహ్ ఏమన్నా చేసిందా అనేలా ప్రెజంట్ చేసింది. సినిమాలో నవ్విస్తుంది, మాథ్స్ ఇంత ఈజీ నా అనేలా చేస్తుంది, ఆలోచించేలా చేస్తుంది, అన్నిటికీ మించి చివర్లో కళ్ళు చెమర్చేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో నేటి తరం గర్వించదగ్గ నటీమణుల్లో టాప్ లిస్ట్ లో విద్యాబాలన్ కి స్థానం ఈ సినిమాతో పదిలం అని చెప్పచ్చు.

ఇక సన్య మల్హోత్రా యాంగ్రీ డాటర్ గా ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అటు ఎమోషనల్ సీన్స్ లో విద్యాబాలన్ కి గట్టి పోటీ ఇచ్చింది. విద్యాబాలన్ – సన్య మల్హోత్రా కెమిస్ట్రీ కూడా బాగా కుదరడం వలన వారి పాత్రలతో ఎక్కువ ట్రావెల్ అవుతాం. జిష్హు షేన్ గుప్త, అమిత్ సాద్ లు ఉన్నంతలో మెరిశారు, మెప్పించారు.

తెర వెనుక టాలెంట్..

కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన అను మీనన్ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒక వ్యక్తి యొక్క బయోపిక్ చెబుతున్నాం అంటే వారి లైఫ్ లోని బిగ్గెస్ట్ లెసన్స్ ని ప్రేక్షకులకి కనెక్ట్ చెయ్యగలిగితే ఆ బయోపిక్ విజయం సాధించినట్టే. ఆ విషయంలో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. కథని అన్ని యాంగిల్స్ లో బాలన్స్ చేసి చెప్పంది. కథనంలో మాత్రం అక్కడక్కడా కాస్త చెప్పిన పాయింట్ నే మళ్ళీ చెప్పి సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ బోరింగ్ ని క్లైమాక్స్ లో ఎమోషన్ తో భర్తీ చేసి అందరినీ సంతృప్తి పరిచింది. అలాగే సౌత్ వారికి ఇది చూస్తున్నప్పుడు మహానటి స్క్రీన్ ప్లే బాగా కనపడుతుంది. ఆ ఫ్లేవర్ కూడా కొంత ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇక పోతే డిఓపి నుంచి కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ ఇలా ప్రతి ఒక్కరు 1940 నుంచి 2001 వరకూ ఉన్న వేరియేషన్స్ ని ప్రెజంట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అలాగే సీన్ వేల్యూ ని మరింత పెంచేలా కరణ్ కులకర్ణి అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది.

చివరిగా డైరెక్టర్ అను మీనన్ శకుంతల దేవి లైఫ్ స్టోరీలోని మూడు విషయాలను కథలో చెప్పిన తీరు అద్భుతం..

1. ప్రతి ఒక్కరూ అమ్మ అంటే తనకి అమ్మతనం ఒక్కటే బాధ్యత, అదితప్ప తనకి ఏమీ తెలియదని చులకనగా చూస్తారు. కానీ ఆమె కూడా ఓ మహిళని తనకి ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయనేది మనం ఎవ్వరం గుర్తించము..

2. మనలోని కోపం ఎన్ని అద్భుతమైన అనుభవాల్ని మిస్ అయ్యేలా చేస్తుంది.

3. అలాగే జడ్జిమెంట్ ఈజీనే కానీ ఆ స్థానంలో ఉన్న వారికే దాని విలువ, అందులోని బాధ తెలుస్తుంది..

విజిల్ మోమెంట్స్:

– విద్యాబాలన్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్
– ఎమోషనల్ క్లైమాక్స్
– మాథ్స్ తో చేసిన ఫన్
– అన్ని డిపార్ట్మెంట్స్ అందించిన సూపర్బ్ టెక్నికల్ వర్క్
– సన్య మల్హోత్రా పెర్ఫార్మన్స్

బోరింగ్ మోమెంట్స్:

– రిపీటెడ్ గా అనిపించే కొన్ని సీన్స్
– అక్కడక్కడా కథనం స్లో అవ్వడం
– బెటర్ గా చెప్పాల్సిన ప్రీ క్లైమాక్స్

విశ్లేషణ:

అద్భుతమైన నటీనటులతో, ది బెస్ట్ టెక్నికల్ టీంతో అందరికీ నచ్చేలా, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన బయోపిక్ ‘శకుంతల దేవి’. ఏ కథకైనా ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా ప్రధానం.. దాన్ని పెర్ఫక్ట్ గా డీల్ చేయడమీ కాకుండా అమ్మ విలువని మరోసారి ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చెప్పడంతో దర్శకుడు అను మీనన్ విజయం సాధించేసాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో కాస్త రిపీటెడ్ సీన్స్ తో బోర్ కొట్టించి సాగదీస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగించినప్పటికీ ప్రతి ఒక్కరూ ఒక్కో చోట కచ్చితంగా కనెక్ట్ అయ్యి చూడగలిగే సినిమా ఇది.

చూడాలా? వద్దా?: మీ ఇంట్లోని మూడు తరాల కుటుంబ సభ్యులు కలిసి చూడాల్సిన సినిమా ‘శకుంతల దేవి’.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 3/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...