Switch to English

రామోజీ లీల.. ఈనాడు ఉద్యోగులు విలవిల.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీడియా మొఘల్‌ ఆయన. తెలుగు మీడియా రంగంలోనే కాదు, ఇతర భాషల్లోనూ మీడియా పరంగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు రామోజీరావు. రామోజీ ఫిలింసిటీ, ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి చిట్‌ఫండ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. కానీ, కరోనా దెబ్బకి.. రామోజీ సామ్రాజ్యం విలవిల్లాడిపోతోందట. కేవలం నాలుగు నెలల్లోనే పరిస్థితి తల్లకిందులయిపోయిన కారణంగా, ఉద్యోగుల తొలగింపు షురూ అయ్యింది. ఈ మేరకు సెటిల్‌మెంట్లు జరుగుతూనే వున్నాయి. కొందరికి ‘సరైన సెటిల్‌మెంట్లు’ లేకుండానే ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాల్ని స్వయంగా బాధిత ఉద్యోగులే సోషల్‌ మీడియా వేదికగా చెబుతున్నారు. తాజాగా, కొందరు ఉద్యోగులు రామోజీరావుకి ఓ లేఖాస్త్రం సంధించారు. ‘పాదాభివందనం’ అంటూనే, తమ సమస్యల్ని ఏకరువు పెట్టేశారు. సంస్థ ఎదుగుదులలో తమ పాత్ర తక్కువేమీ కాదనీ, ఈ కష్ట కాలంలో తమను ఆదుకోవాలని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ‘కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు పెద్దయెత్తున విరాళాలు ప్రకటించారు.. హుద్‌హుద్‌ తుపాను సమయంలోనూ వీరాళాలు ఇచ్చారు. ఇంత పెద్ద మనసున్న మీరు, ఇప్పుడు ఈ కష్ట కాలంలో మమ్మల్ని ఆదుకోలేరా.?’ అంటూ ప్రశ్నించారు సదరు ఉద్యోగులు. ఇప్పుడు ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రామోజీరావుకి వున్న ‘సామ్రాజ్యం’ దృష్టిలో పెట్టుకుంటే, నాలుగు నెలల సంక్షోభం అనేది పెద్ద విషయం కాదన్నది చాలామంది అభిప్రాయం. మరెందుకు ఈ ఉద్వాసనలు.? ముందు ముందు తలెత్తకబోయే అతి పెద్ద సంక్షోభాన్ని ముందే ఊహించి రామోజీ జాగ్రత్తపడ్డారన్నది ఇంకో వాదన. ఎవరి వాదనలు ఎలా వున్నా.. సంస్థ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన ఉద్యోగుల ఉసురు ఏ సంస్థకైనా మంచిది కాదు. పైగా, పొద్దున్న లేస్తే నీతులు చెప్పే మీడియా సంస్థకి రామోజీరావు అధిపతిగా వున్నారాయె. నిజానికి, కరోనా ఎఫెక్ట్‌ షురూ అయిన కొద్ది రోజుల్లోనే ‘ఈనాడు’లో ఈ ‘తొలగింపు’ కలకలం బయల్దేరింది.. అప్పటినుంచీ అది కొనసాగుతూనే వుంది. కేవలం, నెల.. నెలన్నర రోజుల సంక్షోభాన్నే తట్టుకోలేనంత బలహీనంగా వుందా రామోజీ సామ్రాజ్యం.?

రామోజీ లీల.. ఈనాడు ఉద్యోగులు విలవిల.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...