Switch to English

వైఎస్సార్సీపీకి పేరుతో తంటా: ముప్పు పెరుగుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ.. దీన్నే అంతా ‘వైఎస్సార్సీపీ’ అనీ, ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అనీ, ఇంకొందరైతే ‘వైఎస్సార్‌ పార్టీ’ అనీ అంటుంటారు. కానీ, ఇప్పుడు ఈ పార్టీకి పేరుతో పెద్ద చిక్కు వచ్చిపడేలా కన్పిస్తోంది. ఎందుకంటే, ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌’ పేరుతో మరో పార్టీ వుంది. అప్పుడెప్పుడో హరికృష్ణ ‘అన్న తెలుగుదేశం’ పేరుతో పార్టీ పెట్టినట్లన్నమాట.

నిజానికి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ కంటే ముందుగానే ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ ఆవిర్భవించిందట. ఆ పార్టీ అధ్యక్షుడు కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన, తన పార్టీ పేరుని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా వాడేస్తోందంటూ న్యాయపోరాటానికి దిగారు.

ఎప్పుడైతే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి సొంత పార్టీ నుంచి షోకాజ్‌ నోటీస్‌ వెళ్ళిందే, అసలు కథ అప్పుడే మొదలయ్యింది. ఆ షోకాజ్‌ నోటీస్‌లో ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’ అని కాకుండా, ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అని ప్రస్తావించారు వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఈ విషయమై ఎంత యాగీ చేయాలో అంత యాగీ చేసేశారు రఘురామకృష్ణంరాజు.

ఇకపై ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’, తన పేరుని ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’గా చెప్పుకోవడానికే అవకాశం వుండదన్నది ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అధ్యక్షుడు చెబుతున్న మాట. రఘురామకృష్ణరాజు కూడా, ‘అది చెల్లని వ్యవహారం.. పార్టీ పేరుని ఎలా మార్చేస్తారు.?’ అంటూ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడుతున్న విషయం విదితమే. మొత్తమ్మీద, వైసీపీ కొరివితో తలగోక్కున్నట్లయ్యిందిప్పుడు.

మరోపక్క, రఘురామకృష్ణరాజుపై వైసీపీకి చెందిన పలువురు నేతలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసేస్తున్నారు. ఆ ఫిర్యాదులపై చర్యలు వద్దంటూ రఘురామకృష్ణరాజు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అన్నట్టు, రఘురామకృష్ణరాజు కూడా కొద్ది రోజుల క్రితం సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

మొత్తమ్మీద, వైసీపీలో నర్సాపురం ఎంపీ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడటం మాటెలా వున్నా, ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’కి టైటిల్‌ చిక్కులొస్తే పరిస్థితి ఏంటి.? అన్న విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...