Switch to English

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. యాక్షన్‌లోకి గవర్నర్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఇటీవలి కాలంలో గవర్నర్‌ వ్యవస్థపై పలు విమర్శలు ఆయా రాజకీయ పార్టీల నుంచి చూస్తున్నాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సుదీర్ఘ కాలం గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌.. ప్రశంసలతోపాటు విమర్శలూ ఎక్కువే ఎదుర్కొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకూ ఆయన గవర్నర్‌గా కొంత కాలం సేవలందించారు. విమర్శలు, వివాదాల సంగతి పక్కన పెడితే, ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్‌ తనకున్న విశేషాధికారాల్ని వినియోగించుకోవడం కొత్తేమీ కాదు.

ఇక, తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కూడా చాలా యాక్టివ్‌గానే కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా నేపథ్యంలో నిమ్స్ ని సందర్శించారు. వైద్యులకు భరోసా ఇచ్చారు. అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. అప్పట్లో ఈ విషయం రాజకీయంగానూ చర్చనీయాంశమయ్యింది. తాజాగా, తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గవర్నర్‌ తమిళి సై, చీఫ్‌ సెక్రెటరీ సహా ఉన్నతాధికారులతో సమీక్షకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

‘కరోనా కట్టడిలో కేసీఆర్‌ ప్రభుత్వం ఫెయిల్‌.. యాక్షన్‌లోకి గవర్నర్‌ తమిళిసై..’ అంటూ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు మీడియా వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. నిజానికి, వివిధ అంశాలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడంతోపాటు, కీలక సందర్భాల్లో అధికారులతో సమీక్షలు నిర్వహించడం, వారికి తగు ఆదేశాలు ఇవ్వడం గవర్నర్‌ బాధ్యతల్లో భాగమే. గవర్నర్‌ పదవిలోకి వచ్చాక పలుమార్లు తమిళిసై, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అదే సమయంలో, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ప్రభుత్వ పెద్దలు కూడా పలు సందర్భాల్లో గవర్నర్‌తో సమావేశమవుతున్నారు కూడా. ‘ఈ వ్యవహారాన్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదు..’ అని అధికార పార్టీ చెబుతోంటే, ‘తెరవెనుకాల ఏదో జరుగుతోంది..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు టీఆర్‌ఎస్‌పై హాట్‌ హాట్‌ కామెంట్స్‌ చేస్తుండడం గమనార్హం.

ఏదిఏమైనా, తెలంగాణలో కరోనా పరిస్థితి రోజురోజుకీ మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే టెస్టుల సంఖ్య తక్కువగా జరుగుతోంటే, కేసులు మాత్రం ఎక్కువగా నమోదవుతున్నాయి. తద్వారా పాజిటివిటీ రేటు అత్యంత ఆందోళనకరంగా మారుతోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...