‘సైరా నరసింహారెడ్డి’తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ వలన ఆగింది. అది పక్కన పెడితే చిరు 153వ సినిమాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’ ని రీమేక్ చేయనున్నారు. చిరు ఎంతో ఇష్టపడి చేస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే సుజీత్ ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ ని ఫినిష్ చేసాడని ఇది వరకే తెలిపాం.
తాజా సమాచారం ప్రకారం ఈ ఫైనల్ స్క్రిప్ట్ ని ఒకసారి చదివి మార్పులు చేయమని సుకుమార్ ని రిక్వెస్ట్ చేయగా, లాక్ డౌన్ టైంలో సుకుమార్ ఆ పనిలో ఉన్నారట. చెప్పాలంటే మొదట ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయమని సుకుమార్ ని అడిగారు. కానీ సుకుమార్ పుష్ప వలన చేయలేకపోయాడు. కానీ సుజీత్ చేతికి వెళ్ళకముందే సుకుమార్ తన వెర్షన్ మార్పులతో ఒక వెర్షన్ స్క్రిప్ట్ ని చిరుకి ఇచ్చారు. అదే వెర్షన్ ని సుజీత్ మరోసారి తనదైన స్టైల్ లో మార్పులు చేర్పులు చేశారు. అలా సుజీత్ మార్చిన స్క్రిప్ట్ మళ్ళీ సుకుమార్ చేతికి వెళ్లి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఫైనల్ గా ఈ వెర్షన్ చిరుని మెప్పిస్తుందని ఈ చిత్ర టీం ఆశిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు. అలాగే చిరుతో నటించబోయే ఓ కీలకపాత్ర కోసం అన్వేషణ జరుగుతోంది.
540717 601430I genuinely treasure your work , Wonderful post. 935788
36805 710051I genuinely prize your work , Great post. 164519