Switch to English

వైసీపీ శ్రేణుల్లో ‘అసంతృప్తి’ని తగ్గించేదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఏడాదిలో చాలా అద్భుతాలు చేసేశామంటోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ‘కేకులు కట్‌ చేయడం తప్ప, అభివృద్ధి ఏమీ లేదు..’ అంటున్నారు సీనియర్‌ నేతలు. పైగా, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులనుంచే ప్రభుత్వ పాలనపై విమర్శలు వస్తుండడంతో, పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే. కానీ, ‘పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?’ అన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ‘మా పార్టీకి 151 మంది ఎమ్మెల్యేల బలం వుంది..’ అని పదే పదే అధికార వైఎస్సార్సీపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ‘ఎంతమంది వుంటే ఏం లాభం.? ప్రజా క్షేత్రంలో ఈ నెంబర్ల గేమ్ అన్ని సార్లూ చెల్లదు’ అని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.

ఒకరా.? ఇద్దరా.? అరడజను మందికి పైగా వైసీపీ ముఖ్య నేతలే అసహనం వెల్లగక్కుతున్న వేళ, పార్టీ అధిష్టానం ‘డ్యామేజీ కంట్రోల్‌’ కోసం ఓ కమిటీని నియమించే ఆలోచనలో వుందట. అయితే, ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు.? అన్నది మరో కీలకమైన విషయం. ఆనం రామనారాయణరెడ్డి లాంటి నేతల్ని ‘అదుపు చేసే’ స్థాయి గల నేతలు వైసీపీలో లేనే లేరన్నది ఆనం వర్గీయుల వాదన. మరోపక్క, ఎంపీ రఘురామకృష్ణంరాజుని బుజ్జగించడమూ అంత ఆషామాషీ వ్యవహారమే కాదు. ‘ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కూడా దొరకడంలేదు..’ అని ప్రజా ప్రతినిథులు ఆరోపించడం చాలా సీరియస్‌ అంశం. అది నిజమేనా.? ఆ స్థాయిలో పార్టీకి ముఖ్యమంత్రి అందుబాటులో లేకుండా పోయారా.? అని వైసీపీలో గ్రౌండ్‌ లెవల్‌ నుంచీ చర్చ జరుగుతోంది.

‘ఓ కోటరీ వైఎస్‌ జగన్‌ చుట్టూ వుండి.. ముఖ్య నేతలు, ముఖ్యమంత్రి వరకూ వెళ్ళకుండా చేస్తోంది..’ అన్నది ప్రముఖంగా విన్పిస్తోన్న ఆరోపణ. అయితే, ‘క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు క్షణం తీరిక కూడా వుండడంలేదు. ఈ సమయంలో ఈ తరహా అసహన రాజకీయాలు అస్సలేమాత్రం సబబు కాదు..’ అంటూ కొందరు వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ‘మాకే నీతులు చెబుతారా.?’ అంటూ అసమ్మతి నేతలు మరింతగా అధికార పార్టీ పెద్దలపై విరుచుకుపడేలా చేస్తున్నాయి.. ముఖ్యమంత్రిని, కోటరీని వెనకేసుకొస్తూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.

మొత్తమ్మీద, వీలైనంత త్వరగా ఈ అసమ్మతి గళాన్ని దారికి తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. లేదంటే, పరిస్థితి చెయ్యిదాటడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. సరైన సమయం కోసం అటు బీజేపీ, ఇంకోపక్క టీడీపీ ఎదురుచూస్తున్నాయి. బీజేపీ వైపుకు ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు వెళతారనీ, ఓ ఇద్దరు ఎమ్మెల్యేలను లాగేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...