Switch to English

తెలంగాణలో జల అద్భుతం.. ఆంధ్రప్రదేశ్‌కి వుందా ఆ అదృష్టం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెరపైకొచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అతిపెద్ద ప్రాజెక్టుని కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఈ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్‌ని నింపే మోటార్లను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ రోజ ఉప్రారంభించారు.

కాగా, కొద్ది నెలల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా హాజరయిన విషయం విదితమే. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌కి కొన్ని అభ్యంతరాలున్నాయనుకోండి.. అది వేరే విషయం. ఏదిఏమైనా, తెలంగాణలో నీటి సమస్య కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తీరిపోతోంది. మరి, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితేంటి.? ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సంగతేంటి.?

దేశంలోనే పోలవరం ప్రాజెక్టు లాంటి గొప్ప ప్రాజెక్టు భవిష్యత్తులో ఇంకోటి నిర్మితమయ్యే అవకాశం లేదన్నది నిపుణులు చెబుతున్నమాట. పైగా, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వుంది. కానీ, ఏం లాభం.? అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి.. అంటూ గతంలో వైసీపీ నానా యాగీ చేసింది. ఆ యాగీ కారణంగా కేంద్రం, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వడంలో మీనమేషాల్లెక్కెట్టింది. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వచ్చి ఆరేళ్ళయినా.. ఇంకా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదంటే ఏమనుకోవాలి.? తెలంగాణ ప్రభుత్వం తమ సొంత నిధుల్ని వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టుని రూపొందించుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌.. కేంద్ర సాయంతో కూడా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోలేకపోతోంది.

నిజానికి పోలవరం ప్రాజెక్టుకి నిధుల సమస్య కంటే అతి పెద్ద సమస్య రాజకీయం. ఆ రాజకీయమే పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారింది. 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. కానీ, ఆ నమ్మకం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కలగడంలేదు. 70 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు హయాంలోనే పూర్తయిపోయాయని కేంద్రం కూడా లెక్కలు చెబుతోంది. కానీ, ఇప్పటికీ ప్రాజెక్టు పనులపై భిన్న వాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విన్పిస్తున్నాయి.

చంద్రబాబు హయాంలో జరిగిందేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటోంది. రివర్స్‌ టెండరింగ్‌ తదితర వ్యవహారాలతో పోలవరం ప్రాజెక్టు పనులు కొన్ని నెలల పాటు ఆగిపోయిన విషయం తెల్సిందే. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ప్రాజెక్టు పనుల్లో మరింత అలసత్వం కన్పిస్తోంది. కేంద్రం నుంచి నిధులు ఇకపై ఎంత వస్తాయన్నదానిపైనా స్పష్టత లేదు. 2021 నాటికో.. ఆ తర్వాతకో.. అసలు ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో పూర్తవుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితిని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...