Switch to English

జనసేన సభలకు జనం కరువు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయనంటే చాలామందికి విపరీతమైన క్రేజ్. పవర్ స్టార్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పవన్.. ఎక్కడికైనా వస్తున్నారంటే ఆయన్ను చూడటానికి జనం ఎగబడతారు. ఆయన సినిమా ఫంక్షన్లకు వచ్చే అభిమానులైతే మొదటి నుంచి చివరి వరకు పవర్ స్టార్ అంటూ హోరోత్తిస్తూనే ఉంటారు.

అలాంటి పవన్ కల్యాణ్.. సినిమాలకు స్వస్తి పలికి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రశ్నించడానికే అంటూ జనసేన స్థాపించారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఆయన ఎక్కడకు వచ్చినా అభిమానులు పోటెత్తుతున్నారు. అలాంటి పవన్ కల్యాణ్ సభలకు జనం కరువయ్యారన్న వార్త సంచలనంగా మారింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం విశాఖ జిల్లాలో చోడవరం, అనకాపల్లి, పెందుర్తిల్లో జరిగే సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఆయా సభలకు జనం అస్సలు లేకపోవడంతో వాటిని రద్దు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకే రోజు మూడు సభల ద్వారా సత్తా చాటాలని భావించిన జనసేన వర్గాలకు ఇది మింగుడుపడలేదు.

ఏ సభలోనూ సరిగా జనం లేరని, వచ్చే అవకాశాలు కూడా లేవని పేర్కొనడంతో నిర్వాహకులకు సభలు రద్దు చేయడం మినహా మరో అవకాశం కనిపించలేదని తెలుస్తోంది. ఒకవేళ జనాలను సమీకరించాలని భావించినా అది అప్పటికప్పుడు అయ్యే పనికాదు. ఏదైనా సభ నిర్వహించాలంటే అందుకు కొన్ని రోజుల ముందునుంచే ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి నాయకులు జనసమీకరణ బాధ్యత చూసుకుంటారు.

అయితే, ఇలాంటి క్షేత్రస్థాయి నెట్ వర్క్ ఏమీ లేకుండా భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని భావించడం కత్తి మీద సామే. సరైన ప్రణాళిక లేకుండా సభ నిర్వహించాలని భావిస్తే మొదటికే మోసం వస్తుంది. రోడ్ షోల వరకు ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. కానీ బహిరంగ సభల విషయంలో మాత్రం అప్రమత్తంగా లేకుంటే భంగపాటు తప్పదు.

ఇటీవల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ సభ సైతం ఘోరంగా విఫలమైంది. ఆ సభకు పట్టుమని పది వేల మంది కూడా రాలేదన్న సమాచారం తెలుసుకున్న గులాబీ బాస్.. సభకు హాజరుకాకుండానే వెళ్లిపోయారు. తర్వాత అందుకు బాధ్యులైన హైదరాబాద్ నేతలకు తలంటినట్టు సమాచారం.

అధికారంలో ఉన్న పార్టీకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇంకా పూర్తిస్థాయిలో నెట్ వర్క్ లేని జనసేన వంటి పార్టీలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పవన్ అంటే పూనకం వచ్చినట్టుగా ఊగిపోయే ఫ్యాన్స్ కూడా సభలకు ఎందుకు రాలేదనే అంశం ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. పవన్ ప్రసంగాలలో కొత్తదనం లేకపోవడం కూడా ఇందుకు కారణం కావొచ్చని అంటున్నారు.

ఆయన అధికార పార్టీని వదిలేసి విపక్ష పార్టీని మాత్రమే టార్గెట్ చేయడం కూడా చాలామందికి నచ్చడంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా అధికార తెలుగుదేశం పార్టీతో రహస్య అవగాహన కొనసాగిస్తున్నారని, రెండు పార్టీల నేతలు పరస్పరం సహకరించుకుంటున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు చేస్తున్న ప్రచారం కూడా పవన్ కు వ్యతిరేకంగా మారిందని చెబుతున్నారు.

ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో జనసేన వర్గాలు ఒకింత విఫలమయ్యాయని అంటున్నారు. ఇక ప్రచారానికి వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో జనసేన తన వ్యూహం మార్చుకుంటుందో లేదో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...