Switch to English

జనసేనపై టీడీపీకి ‘కసి’ తీరలేదింకా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘మేం గెలవకపోయినా ఫర్లేదు.. జనసేన పార్టీ మాత్రం గెలవకూడదు..’ అనే సిద్ధాంతంతో పనిచేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఆ మాటకొస్తే, ‘చంద్రబాబు బలపడినా నష్టం లేదు.. కానీ, పవన్‌ కళ్యాణ్‌కి రాజకీయంగా పుట్టగతులుండకూడదు..’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ భావిస్తోంది. ‘చేస్తే రాజకీయం మేమిద్దరమే చెయ్యాలి తప్ప, ఇంకెవరం రాజకీయాలు చేయడానికి వీల్లేదు..’ అన్నట్లు టీడీపీ, వైఎస్సార్సీపీ వ్యవహరిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొట్టిన దెబ్బ జనసేన పార్టీకి గట్టిగానే తగలింది. ‘మేమంతా ఒక్కటే.. జనసేన మా మిత్రపక్షమే..’ అని టీడీపీ నేతలు చేసిన ప్రచారంతో జనసేన పార్టీ కోలుకోలేని దెబ్బ తినేసిన విషయం విదితమే. మరోపక్క, కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ‘జనసేనకు ఓటేస్తే అది తెలుగుదేశం పార్టీకి వెళుతుంది.. అందుకే, మమ్మల్ని గెలిపించండి..’ అంటూ నినదించారు.

కొందరైతే, పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు పెట్టుకుని తిరిగారు.! ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయం. వైసీపీ సంగతి పక్కన పెడితే, టీడీపీ నుంచి జనసేనకు ఇంకా డ్యామేజీ జరుగుతూనే వుంది. పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో నటించడాన్ని టీడీపీ నేతలు సమర్థిస్తున్నారు. అసలు జనసేనను సమర్థించాల్సిన అవసరం టీడీపీకి ఏమొచ్చింది.

జనసేనపై టీడీపీది ‘ప్రేమ’ అనుకుంటే పొరపాటే. ఇది ‘కసి’. అవును, అక్షరాలా.. జనసేన మీద వున్న ‘కసి’ అంతా తీర్చేసుకుంటోంది టీడీపీ. టీడీపీ, జనసేనను వెనకేసుకొస్తోందంటే.. టీడీపీ – బీజేపీ కలిసిపోయాయన్న సంకేతాలు వెళతాయి.. అలా వెళితే, జనసేనను మరింతగా వైసీపీ విమర్శిస్తుంది.. ఇదీ టీడీపీ వ్యూహం.

తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో నటించడం పట్ల సానుకూలంగా స్పందిస్తూ, జేడీ లక్ష్మినారాయణ మీద విమర్శలు చేయడం గమన్హాం. మరోపక్క, జేడీ లక్ష్మినారాయణని కొందరు టీడీపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తుండడం కొసమెరుపు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...