Switch to English

కేసీఆర్ కీ సీఏఏ అర్థం కాలేదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కూడా సరిగా అర్థం కాలేదా లేక ఉద్దేశపూర్వకంగానే అలా మట్లాడారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సీఏఏ, ఎన్సీఆర్, ఎన్పీఆర్ లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు తాము సీఏఏ అమలు చేయబోమని ఇప్పటికే స్పష్టం చేశాయి. గత కొంతకాలంగా ఈ విషయంలో నిరసనలు జరుగుతున్నా.. మౌనంగా ఉన్న కేసీఆర్ తాజాగా దీనిపై స్పందించారు.

మున్సిపల్ ఫలితాల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీటిపై తమ విధానమేంటో స్పష్టంచేశారు. సీఏఏ నూటికి నూరు శాతం తప్పుడు నిర్ణయమని, సుప్రీంకోర్టు దానిని సుమోటోగా స్వీకరించి కొట్టివేయాలని పేర్కొన్నారు. ముస్లింలకు నష్టం చేసే అలాంటి నిర్ణయాన్ని తాము సమర్థించబోమని స్పష్టంచేశారు. వాస్తవానికి సీఏఏ వల్ల భారతదేశంలోని ఏ ముస్లింకూ నష్టం జరగదు అని బీజేపీ చెబుతున్నా, అది జనంలోకి బాగా వెళ్లలేదు.

ఆ చట్టం ఉద్దేశం పొరుగు దేశాల్లో ఉన్న మైనారిటీలకు మన దేశ పౌరసత్వం కల్పించడం. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి మన పొరుగు దేశాల్లో ముస్లింలు మైనారిటీలు కాదు. అందువల్లే వారికి మన పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని బీజేపీ స్పష్టంచేస్తూ సీఏఏ తీసుకొచ్చింది. దీనివల్ల మన దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదు. అసలు వారికి సంబంధించింది కూడా కాదు. కానీ కేసీఆర్ మాత్రం ఇది ముస్లింలందరికీ నష్టం చేకూర్చే చట్టం అంటూ బీజేపీ పై విమర్శలు చేయడం గమనార్హం.

పైగా ఇన్నాళ్లూ ఈ అంశంపై మౌనంగా ఉండి ఇప్పుడు స్పందించడం కూడా వ్యూహమే అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఈ విషయాన్ని ప్రస్తావించి తమ వైఖరి చెబితే.. అది బీజేపీకి లాభించే అవకాశం ఉందని భావించడం వల్లే ఇప్పటివరకు దీనిపై కేసీఆర్ మౌనాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ విజయఢంకా మోగించడంతో సీఏఏపై కేసీఆర్ స్పందించారని అంటున్నారు.

ఇక పొరుగుదేశాల ముస్లింలపై ప్రేమ కనబరుస్తున్న కేసీఆర్.. ఛత్తీస్ గడ్ నుంచి బతుకుజీవుడా అంటూ రాష్ట్రానికి వచ్చిన గుత్తికాయల విషయంలో అనుసరించిన వైఖరి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు తాను తీసుకున్న నిర్ణయం సరైనదే అయితే, సీఏఏ విషయంలో కేంద్రానిది కూడా సరైన నిర్ణయమేనని పలువురు పేర్కొంటున్నారు. మరి వీటికి కేసీఆర్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...