పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఏ నిమిషాన రీ ఎంట్రీ అన్నాడో కానీ అప్పటినుండి తన సినిమాల విషయంలో వార్తలు ఎక్కడా తగ్గట్లేదు. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి తర్వాతి సినిమాను కూడా పవన్ మొదలుపెట్టనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
అసలు పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురావడానికే బోలెడంత తాత్సరం చేసాడు. దాదాపు నాలుగైదు నెలల వెయిటింగ్ తర్వాత కానీ ఈ సినిమా మొదలవ్వలేదు. పింక్ రీమేక్ కే ఇంత టైమ్ తీసుకున్న పవన్ తర్వాత క్రిష్ తో సినిమా వెంటనే మొదలుపెడతాడన్న గ్యారంటీ లేదు. సినిమాల్లో ఫుల్ టైమ్ నటిస్తున్నప్పుడే పవన్ అయిష్టంగా సినిమాలు చేసేవాడు. ఇప్పుడు రాజకీయాలు చూస్తూ సినిమాలు చేసుకోవాలి. అందుకే పవన్ కొత్త సినిమా అంటూ ఎన్ని వార్తలు వచ్చినా ప్రజలు అంత త్వరగా నమ్మడానికి ఇష్టపడడం లేదు. అయితే పవన్ ఇప్పటికే క్రిష్ ప్రాజెక్ట్ కు పచ్చ జెండా ఊపాడన్నది చాలా బలంగా వినిపిస్తున్న వాదన. పవన్ సినిమాలు చాలా త్వరగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
క్రిష్ సినిమా మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం కాకుండా మరో బలమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో షికార్లు చేస్తోంది. అదే పూరి జగన్నాథ్ తో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్. గతంలో బద్రి, కెమేరామ్యాన్ గంగతో రాంబాబు చిత్రాలకు ఇద్దరూ కలిసి పనిచేసారు. పూరితో సినిమా అంటే పవన్ అభిమానుల్లో క్రేజ్ మరో లెవెల్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా వార్తలు నిజమేనా? నిజమైతే బాగుంటుంది అని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.
82471 539829hey there, your website is low cost. We do thank you for function 922872
489057 338154Hey quite nice weblog!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your site and take the feeds alsoIm satisfied to seek out numerous helpful information here inside the post, we require develop more techniques on this regard, thanks for sharing. 982023
139530 21309As soon as I found this internet site I went on reddit to share some of the enjoy with them. 306652
135524 940148Taylor Lautner By the way you might want to check out this cool website I found 861922