Switch to English

మండలిపై మడమ తిప్పుతారా.. ముందుకే వెళతారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏపీ శాసనమండలి విషయంలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మదిలో ఏముంది? రద్దు దిశగానే ముందుకెళ్తున్నారా లేక ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచిస్తున్నారా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మండలి కారణంగా ఏటా రూ.60 కోట్లు ఖర్చవుతోందని, మనలాంటి పేద రాష్ట్రానికి మండలి అవసరమా అని ప్రశ్నించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో మండలి లేనే లేదని కూడా పేర్కొన్నారు. దీంతో శాసనమండలి రద్దుకే ఆయన మొగ్గు చూపుతున్నారని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు.

ఈలోగా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మండలిని రద్దు చేయడం వల్ల రాజకీయంగా మనకు కూడా నష్టమేనని, అందువల్ల టీడీపీ ఎమ్మెల్సీలను మన వైపు తిప్పుకుంటే సరిపోతుందని ఒకరిద్దరు నేతలు జగన్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం జగన్ తో పలువురు మంత్రులు భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

2021 నాటికి మండలిలో మన బలం పెరుగుతుందని, అప్పటివరకు కాస్త ఓపిక పడితే బాగుంటుందేమో ఆలోచించాలని మంత్రులు పేర్కొనగా.. అప్పటివరకు ఈ ఇబ్బందులు తప్పవు కదా అని జగన్ ప్రశ్నించినట్టు సమాచారం. ఈలోగా కలిసివచ్చే ఎమ్మెల్సీలను తీసుకుని వారిని మండలిలో ఓ ప్రత్యేక గ్రూప్ గా ఏర్పాటు చేస్తే.. మండలిని సాఫీగా సాగించవచ్చని మంత్రులు పేర్కొన్నట్టు చెబుతున్నారు. కానీ ఈ ప్రతిపాదనపై జగన్ అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. చూద్దాంలే అని ధోరణి వ్యక్తంచేసినట్టు సమాచారం.

నిజానికి జగన్ ఓ నిర్ణయం తీసుకుంటే దాని నుంచి అంత త్వరగా వెనక్కి వెళ్లరని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. మరి మండలి విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. వాస్తవానికి మండలిపై తన అభిప్రాయం ఇదీ అని జగన్ స్పష్టంగా ఇంకా చెప్పలేదు.

మంచి చేయని మండలి అవసరమా? దీనిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పి హీట్ పుట్టించారు. దీంతో మీడియాలో కథనాలు హోరెత్తిపోతున్నాయి. మండలి రద్దుకే మొగ్గు చూపుతారా? లేక తన నిర్ణయం నుంచి వెనక్కి వెళతారా అంటూ కుప్పలుతెప్పలుగా విశ్లేషణలు వస్తున్నాయి. వీటన్నింటికీ సోమవారం ఫుల్ స్టాప్ పడనుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....