Switch to English

ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి ఎన్ని తంటాలో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏపీలో శాసనమండలి రద్దు బెదిరింపుతో రాజకీయాలు వేడెక్కాయి. మంచి చేయని ఈ మండలి అవసరమా? దీనిపై సోమవారం సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయానికి వద్దాం అంటూ ఏపీ సీఎం చేసిన ప్రతిపాదనకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడం.. సోమవారం చర్చకు రంగం సిద్ధం కావడం.. ఈలోగా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అధికార వైఎస్సార్ సీపీ ప్రయత్నాలు చేస్తుండటంతో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.

ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతున్న మండలిలో తమదే ఆధిపత్యం ఉండాలని, లేకుంటే అసలు మండలినే లేకుండా చేయాలని వైసీపీ గట్టి నిర్ణయానికి వచ్చేసింది. అయితే, రాబోయే మూడేళ్లలో తమ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉన్నందున రద్దు కంటే ముందుగా బేరసారాలకే మొగ్గు చూపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలతో అధికార పార్టీ నేతలు సంప్రదింపులు షూరూ చేసినట్టు సమాచారం.

సోమవారంలోగా అనుకూల పరిస్థితులు వస్తే సరే.. లేకుంటే మండలి రద్దు తీర్మానం ఛేయడం ఖాయమే. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్సీలు చేజారిపోకుండా చూసుకోవడానికి టీడీపీ సమాయత్తమైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఎవరూ ప్రలోభాలకు గురికావొద్దని, ఏ సమస్య వచ్చినా పార్టీ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.

మండలిని రద్దు చేయడం కుదరదని, ఒకవేళ రద్దు చేసినా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని పునరుద్ధరిస్తామని హామీ కూడా ఇచ్చేశారు. మండలి రద్దుతో పదవులు పోగొట్టుకున్నవారికి అప్పుడు అవకాశమిస్తానని చెప్పారు. అలాగే జీతభత్యాలరూపంగా జరిగే నష్టాన్ని సైతం పార్టీపరంగా తీరుస్తామని భరోసా ఇచ్చారు.

అయితే, ఇన్ని హామీలు ఇచ్చినా.. వారు కచ్చితంగా పార్టీలోనే ఉంటారా అంటే చివరి క్షణం వరకు చెప్పలేని పరిస్థితి. మొత్తానికి తమ నేతలను అధికార పార్టీ లాగేసుకుండా చూసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు చంద్రబాబుకు తెలిసొస్తోంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు కుమ్మరించి, పదవుల ఆశ చూసి 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. అధికారంలో ఉండటంతో అప్పుడు ఆయనది అప్పర్ హ్యాండ్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

అధికారం పోవడం.. అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేటింగ్ అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వస్తుండటం.. పార్టీ నేతలపై కేసులు నమోదు కావడం వంటి పరిణామాలు బాబుకు ఇబ్బందిగా పరిణమించాయి. ఇదే సమయంలో ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అవి ఎంతవరకు ఫలిస్తాయో సోమవారం తెలిసిపోతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...