Switch to English

యనమల.. ఏంటి సార్ ఇలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘‘రాజధాని ఎక్కడో కేంద్రం నిర్ణయించింది.. కాదనడానికి సీఎం ఎవరు? గతంలో హిట్లర్ కూడా ఇలాగే వ్యవహరించి చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. మండలి నడపటానికి ఏటా రూ.60 కోట్లు ఖర్చవుతున్నాయని రద్దు చేస్తానంటున్నారు. మరి అసెంబ్లీ నడపటానికి కూడా ఏటా రూ.150 కోట్లు ఖర్చవుతోంది. అలా అని దానిని కూడా రద్దు చేస్తారా? అయినా మండలిని రద్దు చేయడం వీళ్ల చేతిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం తీర్మానం మాత్రమే చేసి పంపిస్తంది. దానిని ఆమోదించాలా.. వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వ ఇష్టం’’ – ఇవీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు.

ప్రస్తుతం వీటిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన యనమల చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు. మండలి కొనసాగించాలా.. వద్దా అనేది రాష్ట్రం ఇష్టమే. దానిని ఆమోదించాల్సింది పార్లమెంటు అయినప్పటికీ, మండలి మాకు అవసరం లేదు అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తీర్మానం చేసి పంపిస్తే.. పార్లమెంటు దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ ఇలాగే మండలి రద్దుపై తీర్మానం చేసి పంపిస్తే.. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కాంగ్రెస్ కే నష్టం చేకూరుస్తుందని తెలిసినా.. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి, అసెంబ్లీ తీర్మానానికి గౌరవం ఇచ్చి రాజీవ్ గాంధీ మండలి రద్దుకు ఆమోదం తెలిపారు. అనంతరం వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మండలిని పునరుద్ధరించారు. తాజాగా దానిని రద్దు చేసే దిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాలా లేక తిరస్కరించాలా అన్నది మాత్రం కేంద్రం ఇష్టం. ఈ విషయం అందరికీ తెలుసని పేర్కొంటున్నారు.

ఇక ఏపీ రాజధానిని నిర్ణయించింది కేంద్రం కాదని.. తెలుగుదేశం ప్రభుత్వమే అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అని అనేక లీకులిచ్చి, తాము భూములు కొనేశాక అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. అసలు కేంద్రం అమరావతిని గుర్తించనేలేదని, ఇటీవల కొత్తగా విడుదల చేసిన మ్యాప్ లో అమరావతిని రాజధానిగా పేర్కొనకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై గెజిట్ జారీచేసిన తర్వాతే కేంద్రం దానిని గుర్తిస్తుందనే సంగతి తెలియదా అని యనమలను ప్రశ్నిస్తున్నారు. పైగా రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. పార్టీపరంగా మాత్రమే తాము ఈ విషయంలో స్పందిస్తామని, కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోదని ఇప్పటికే బీజేపీ నేతలు స్పష్టంచేసిన విషయం మరచిపోయారా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.

ఇక మండలిని రద్దు చేయాలనుకున్నట్టే, శాసనసభను కూడా రద్దు చేస్తారా అని రెండింటికీ తేడా తెలియకుండా యనమల మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ‘‘ఎమ్మెల్యేలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. పాలన సాగాలంటే అసెంబ్లీ ఉండాలి. కానీ శాసనమండలి అనేది కేవలం రాజకీయ పునరావాస కేంద్రం మాత్రమే. అది లేకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో శాసనమండలి లేనేలేదు’’ అని పేర్కొన్నారు. అలాంటి శాసనసభను మండలితో పోల్చి రద్దు చేస్తారా అని ప్రశ్నించడం ఏమిటని మండిపడుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....