Switch to English

‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నటీనటులు: రాజ్ తరుణ్, షాలినీ పాండే..
నిర్మాత: శిరీష్
దర్శకత్వం: జిఆర్ కృష్ణ
సినిమాటోగ్రఫీ: స‌మీర్ రెడ్డి
మ్యూజిక్: మిక్కీ జె.మేయ‌ర్‌
ఎడిటర్‌: తమ్మి రాజు
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2019

వరుస పరాజయాలతో పూర్తిగా ఢీలా పడిపోయి ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ – అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే జంటగా నటించిన లవ్ స్టోరీ ‘ఇద్దరి లోకం ఒకటే’. లవర్ ‘ సినిమాతో రాజ్ తరుణ్ కి హిట్ ఇవ్వలేకపోయింది దిల్ రాజు ఈ సారి పక్కా హిట్ ఇస్తానన్న కాన్ఫిడెంట్ తో చేసిన ఈ సినిమాని ఇప్పటికే పలు చోట్ల యూత్ కి స్పెషల్ గా ప్రదర్శించడం, యూత్ కి బాగా నచ్చడంతో మంచి హైప్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ప్రేమ కథ యూత్ తో పాటు కామన్ ఆడియన్స్ కి కూడా ఎంతవరకూ నచ్చిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

మహి(రాజ్ తరుణ్) ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్, వర్ష(షాలిని పాండే) హీరోయిన్ కావాలనుకునే ఒక స్ట్రగుల్ యాక్టర్. వర్ష చిన్ననాటి ఫొటోగ్రాఫ్ వల్ల అనుకోకుండా తారసపడిన మహి అండ్ వర్ష, చిన్నతనంలోనే ఫ్రెండ్స్ అయ్యుంటారు. చైల్డ్ హుడ్ మెమోరీస్ గుర్తు చేసుకొని అడల్ట్స్ గా మళ్ళీ మొదలైన వీరిద్దరి జర్నీ ఎలాంటి మలుపులు తిరిగింది? వీరిద్దరి స్నేహం ప్రేమగా మారిందా? లేదా? చిన్నప్పటి నుంచే మహికి ఉన్న ఓ మేజర్ సమస్య ఏమిటి? ఆ సమస్య కోసం వర్ష ఏం త్యాగం చేసింది? అనేదే కథ..

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

తెరపైన అద్భుతంగా నటన కనబరిచిన స్టార్స్ లో ది హైలైట్ గా చెప్పుకోవాల్సింది షాలిని పాండే పెర్ఫార్మన్స్ గురించి.. షాలిని పాండే చూడటానికి చాలా క్యూట్ గా ఉంది, అంతకన్నా సూపర్బ్ గా పెర్ఫార్మన్స్ చేసింది. రాజ్ తరుణ్ చాలా సెటిల్ అండ్ కూల్ పాత్రలో బాగానే చేసాడు. మాములుగా లౌడ్ పాత్రల్లో చూసిన రాజ్ తరుణ్ ని ఇందులో చాలా కామ్ గా చూస్తాం. సినిమా అపారంగా బాగా చేసినా, తన నుంచి మాస్ ఆశించే అభిమానులకి మాత్రం కాస్త నిరాశ పడచ్చు. అలాగే చైల్డ్ హుడ్ పాత్రలు చేసిన మాస్టర్ రోషన్ మరియు బేబీ నేత్ర రెడ్డిలు అద్భుతంగా నటించారు. ఇక మిగిలిన కీలక పాత్రలు చేసిన రోహిణి, నాజర్ ఎమోషనల్ టచ్ బాగానే యాడ్ చేసింది. ఇక భరత్ ఉన్నా లేనట్టే అనే పాత్ర చేసాడు..

సినిమా పరంగా చూసుకుంటే.. చైల్డ్ హుడ్ ఎపిసోడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా తీశారు. ఈ ఎపిసోడ్స్ చాలా మందికి తమ బాల్యాన్ని గుర్తు చేసే అవకాశం ఉంది. అలాగే రాజ్ తరుణ్ – షాలిని పాండే మధ్య వచ్చే కొన్ని మోమెంట్స్ బాగున్నాయి. అలాగే అన్ని పాటలని మోంటేజస్ రూపంలో తీయడం వలన చూడటానికి బాగుంటాయి. అలాగే క్లైమాక్స్ ఎమోషనల్ గా బాగుంది.

ఆఫ్ స్క్రీన్:

ఈ సినిమా కోసం సమీర్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా, ఒక వింటేజ్ పెయింటింగ్ లా తీశారు. అందుకే సినిమా బాలేకపోయినా మనం విజువల్స్ చూస్తూ ఉంటాం. అలాగే ఈ దృశ్యకావ్యం లాంటి విజువల్స్ కి మిక్కీ జె మేయర్ వినసొంపైన సంగీతం మరియు నేపధ్య సంగీతంతో విజువల్ కి మరింత అందాన్ని యాడ్ చేశారు. లొకేషన్స్, బండి రత్నకుమార్ ఆర్ట్ వర్క్ అదిరింది. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. మొదట్లో మరియు చివర్లో కనెక్ట్ చేసిన స్టోరీ మెయిన్ ఎమోషనల్ పాయింట్ చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సినిమా మొదలవ్వడం చాలా స్లోగా ఉంటుంది, అదే స్లో పేస్ లోనే సినిమా అంతా జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్స్, చిన్న చిన్న క్లూస్ తో పరవాలేధనిపించాడు అనుకొని మనకి మనమే సర్దుకున్నా, సెకండాఫ్ మాత్రం చాలా చాలా బోర్ కొట్టించేసాడు. ముఖ్యంగా వరుసబెట్టి పాటలు పెట్టేసి కాస్త చిరాకు పెట్టించేసాడు. అలాగే సినిమా మొదట్లో పాత్రలు ఎక్కడ మొదలయ్యాయో చివరి వరకూ అక్కడే ఉంటాయి, ఎమోషనల్ బాండింగ్ గ్రోత్ అనేది ఉండదు. ముఖ్యంగా ఇదొక ఎమోషనల్ డ్రామా, సో మొదట్లోనే హీరో హెరాయిన్ పాత్రలని ఆడియన్స్ కి కనెక్ట్ చేయాలి అప్పుడే ఆడియన్స్ లవ్ స్టోరీస్ ని ఎంజాయ్ చేస్తారు. కానీ అది మిస్ అవ్వడంతో ఆ ప్రేమ కథకి పెద్దగా ఎవరూ కనెక్ట్ కాలేకపోయారు. అలాగే సినిమాలో నవ్వుకునేలా ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదు.

ఆఫ్ స్క్రీన్:

‘లవ్ లైక్స్ కో ఇన్సిడెన్సెస్’ అనే టర్కిష్ ఫిల్మ్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్న ఈ సినిమా స్టోరీ లైన్ సూపర్బ్ అని చెప్పాలి. కానీ మన తెలుగు వారికి కోసం కథని రాసుకున్న విధానం బాలేదు. ముఖ్యంగా పాత్రలని కనెక్ట్ చేయలేకపోవడం, పాత్రల డిజైనింగ్ సరిగా లేకపోవడం ఈ కథకి బిగ్గెస్ట్ మైనస్. అలాగే జిఆర్ కృష్ణ స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రమే. చాలా స్లో పేస్ నేరేషన్ చేయడం, స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా ఉండడం, ఎమోషనల్ గా ఆడియన్స్ కి హై మోమెంట్స్ ఇవ్వకపోవడం వలన సినిమా చాలా బోరింగ్ గా ఉంటుంది. 2 గంటల సినిమానే అయినా 5 గంటలు చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇక డైరెక్టర్ గా కూడా తను పేపర్ మీద రాసుకున్న ఎమోషన్ ని ఆన్ స్క్రీన్ ప్రెజంటేషన్ లో ఫెయిల్ అయ్యారు. మాములుగా అయితే ఆ క్లైమాక్స్ ఆడియన్స్ వాళ్ళకే తెలియకుండా ఏడ్చేలా చేసేంత కంటెంట్ ఉంది. కానీ చాలా సింపుల్ వే లో తీసేసేసి ఓకే ఓకే అనిపించుకున్నాడు. ఎడిటర్ తమ్మి రాజు వీలైనంత కట్ చేసినట్టున్నారు కానీ అది కూడా చాలా లెగ్థ్ అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ అయితే ఎదో వెళ్తుంటాయి సీన్ టు సీన్ ప్రోపర్ సింక్ ఉండదు. సో స్క్రిప్ట్ లోనే తప్పులున్నాయి కాబట్టి ఆయన్నీ ఏం అనలేం.

విశ్లేషణ:

‘ఇద్దరి లోకం ఒకటే’ – దిల్ రాజు భారీగా చేసిన ప్రమోషన్స్, యూత్ కి షోస్ వేసి సూపర్బ్ మూవీ అని వారితో సర్టిఫై చేయడం లాంటివి థియేటర్స్ కి ప్రేక్షకులని రాబట్టుకోగలిగాయే తప్ప, వచ్చిన ఆడియన్స్ కి ఓ అందమైన, మనసుకు హత్తుకునే ప్రేమ కథని అందించడంలో పూర్తిగా విఫలమైంది. పాయింట్ గా బాగున్నా బోరింగ్ సీన్స్ మరియు స్లో నేరేషన్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. అలాగే వరుసగా గ్యాప్ లేని పాటలతో అక్కడక్కడా ప్రేక్షకులకి నిద్ర వచ్చేలా చేశారు. మరీ స్లో పేస్ లవ్ స్టోరీస్ లేదా రాజ్ తరుణ్ సినిమా ఎలా ఉన్నా చూడాల్సిందే అనుకునే డై హార్డ్ ఫాన్స్ ఈ సినిమా చూడచ్చు, మిగతా వారికి అంతగా నచ్చదు. వరుసగా ఆరు పరాయజయలతో చాలా ఢీలా పడిపోయి ఉన్న రాజ్ తరుణ్ ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా కూడా మరోసారి నిరాశనే మిగిల్చింది.

ఫైనల్ పంచ్: ఇద్దరి లోకం ఒకటే – ఈ ఇద్దరి లవ్ స్టోరీ వెరీ బోరింగ్.! 

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2/5

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...
నటీనటులు: రాజ్ తరుణ్, షాలినీ పాండే.. నిర్మాత: శిరీష్ దర్శకత్వం: జిఆర్ కృష్ణ సినిమాటోగ్రఫీ: స‌మీర్ రెడ్డి మ్యూజిక్: మిక్కీ జె.మేయ‌ర్‌ ఎడిటర్‌: తమ్మి రాజు విడుదల తేదీ: డిసెంబర్ 25, 2019 వరుస పరాజయాలతో పూర్తిగా ఢీలా పడిపోయి ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ - అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే జంటగా నటించిన లవ్ స్టోరీ 'ఇద్దరి లోకం ఒకటే'....'ఇద్దరి లోకం ఒకటే' మూవీ రివ్యూ