Switch to English

రాజధాని ఎక్కడ.? మళ్ళీ కెలికిన బొత్స సత్య’నారాయణ’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘నేను సత్యనారాయణ.. నారాయణ కాదు.. మళ్ళీ చెబుతున్నా సత్యనారాయణ..’ అంటూ పదే పదే మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో మాజీ మంత్రి నారాయణ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తొలిసారి మంత్రి అయిన నారాయణకు అప్పట్లో చంద్రబాబు, రాజధాని నిర్మాణ బాధ్యతలు అందించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆ రాజధాని పేరుతో నారాయణ అడ్డంగా బొక్కేశారన్న విమర్శలున్నాయి.

ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ, ‘నేను నారాయణ కాదు..’ అంటూ ప్రెస్‌మీట్‌లో ఒకింత హడావిడి చేశారు. అయితే, రాజధాని అమరావతి విషయంలో మరోసారి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడుండాలి.? ఎలా వుండాలి.? అన్నదానిపై ఓ కమిటీ వేసిందట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిని డిసైడ్‌ చేస్తారట.

అదేంటీ, అమరావతినే రాజధానిగా కొనసాగుతుందని పలువురు మంత్రులు చెప్పారు కదా.? అంటే, జగన్‌ సర్కార్‌ పుణ్యమా అని రాజధాని అమరావతి మెడపై ‘కత్తి’ ఇంకా వేలాడుతూనే వుందన్న విషయం ఇంకోసారి స్పష్టమయ్యిందంతే. అమరావతిని అభివృద్ధి చేసే విషయమై టీడీపీ ఆలోచనలకు భిన్నంగా వైసీపీ వుండొచ్చుగాక. కానీ, మొత్తంగా రాజధాని అమరావతినే మార్చేయాలన్న ఆలోచన చేస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

గతంలో టీడీపీ – అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఇప్పుడు వైసీపీ ఇంకో రాజధానిని ప్రకటిస్తుందేమో. రేప్పొద్దున్న మరో ప్రభుత్వం వస్తే, కొత్త రాజధాని గురించి వినాల్సి రావొచ్చు. అంటే, ఆంధ్రప్రదేశ్‌కి అసలంటూ రాజధాని వుండకూడదన్న ఆలోచన అన్ని రాజకీయ పార్టీలూ కలిసి కట్టుగా చేస్తున్నాయా.? అన్న అనుమానాలు కలగక మానవు.

రాజధాని ఏ రాష్ట్రానికైనా అత్యంత కీలకం. అభివృద్ధి అంతా ఆ రాజధాని చుట్టూనే ఎక్కువగా జరుగుతుంటుంది. రాజధాని లేని రాష్ట్రంలో అభివృద్ధి ఎలా సాధ్యం.? తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చుకుంటూ పోతే, సమీప భవిష్యత్తులో రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా పోతుందన్నది నిర్వివాదాంశం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...