Switch to English

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నటీనటులు: అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ తదితరులు.
నిర్మాత: ఓఏకె ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం: ఓంకార్
సినిమాటోగ్రఫీ: చోట కె నాయుడు
మ్యూజిక్: షబీర్
ఎడిటర్‌: గౌతం రాజు
విడుదల తేదీ: 18 అక్టోబర్ 2019

ఈ మధ్యకాలంలో హార్రర్ కామెడీ సినిమాలు తెలుగులో చాలానే హిట్ అయ్యాయి. అలా హిట్ అయ్యి, తనకంటూ సెపరేట్ పేరు సంపాదించుకున్న సినిమా ‘రాజుగారి గది’. దాంతో ఆ పేరుకి సీక్వెల్స్ రావడం మొదలయ్యాయి, అలా నేడు మూడవ పార్ట్ గా ‘రాజుగారి గది 3’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండవ మిస్టేక్ లో చేసిన మిస్టేక్ ని సరిచేసుకొని ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే టాగ్ లైన్ తో ప్రమోట్ చేసిన ఈ సినిమాలో ప్రేక్షకులని ఎంతవరకూ ఎంటర్టైన్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్రతి హార్రర్ కామెడీ సినిమా లాంటి యాజిటీజ్ కథే ఇది కూడా.. ఇక అసలు కథలోకి వెళితే. మాయ(అవికా గోర్) ఒక హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ గా పని చేస్తుంటుంది. ఎవరన్నా తనకి ఐ లవ్ యు చెబితే యక్షిణి దెయ్యం వచ్చి వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే చాలా ఆవారాగా తిరిగే కుర్రాడు మన హీరో (అశ్విన్ బాబు). ఆ ఏరియా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడని మాయ గురించి తెలిసి అశ్విన్ ని మాయతో జత చేయడానికి ట్రై చేస్తారు. అనుకున్నట్టే అశ్విన్ మాయ ప్రేమలో పడతాడు. ఐ లవ్ యు చెప్పగానే అశ్విన్ ని దెయ్యం ఆడుకోవడం మొదలు పెడుతుంది. ఇక అక్కడి నుంచి అశ్విన్ తన ప్రేమని కాపాడుకోవడం కోసం ఏం చేసాడు.? అసలు మాయ బ్యాక్ డ్రాప్ ఏంటి? అసలు యక్షిణి ఎవరు? ఎందుకోసం మాయకి రక్షణగా ఉంటోంది? అసలు యక్షిణి కథ ఏంటి? ఫైనల్ గా యక్షిణి ఏమైంది? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

  • అశ్విన్ బాబు గత సినిమాల్లో కంటే ఇందులో నటుడిగా తనని తాను పూర్తిగా ఆవిష్కరించుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్, కామెడీ, డైలాగ్ డెలివరీ, భయపెట్టడం.. ఇలా అన్ని వేరియేషన్స్ లో నటుడిగా సత్తా చాటుకున్నాడు. నటుడిగా ఓకే కానీ సినిమా పరంగా చూసుకుంటే అతనికి పెద్దగా హెల్ప్ అవ్వదు.

  • అవికా గోర్ చాలా రోజులకి మళ్ళీ తెలుగు తెరపై కనిపించి తన పాత్రకి న్యాయం చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఘోస్ట్ గా తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.

  • అలీ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. కానీ అక్కడక్కడ మాత్రమే నవ్వించగలిగారు.

  • సీనియర్ నటి ఊర్వశి, అజయ్ ఘోష్, ధన్ రాజ్ లు సెకండాఫ్ లో బాగా నవ్విస్తారు.

ఆఫ్ స్క్రీన్:

  • చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలైట్. ప్రేక్షకుడికి కనిపించే ప్రతి ఫ్రేమ్ ని హార్రర్ కామెడీ సినిమాకి పర్ఫెక్ట్ అనేలా డిజైన్ చేసాడు, ఆడియన్స్ కూడా ఆ విజువల్స్ వల్లే కొంతవరకూ కూర్చోగలరు.

  • విజువల్ ఇన్వాల్వ్ మెంట్ ని మరింత రేకెత్తించేలా, కొన్ని చోట్ల ఉలిక్కిపడేలా భయపెట్టడంలో మ్యూజిక్ డైరెక్టర్ షబ్బీర్ సక్సెస్ అయ్యాడు. దృశ్యం – శ్రవణం ఈ సినిమాకి ప్లస్ అవుతాయి.

  • అలాగే హార్రర్ ఎఫెక్ట్స్ కోసం క్రియేట్ చేసిన కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

  • సాహి సురేష్ సెట్స్, చిన్న చిన్న వస్తువులని డిజైన్ చేసిన విధానం సినిమాకి హెల్ప్ అయ్యాయి.

  • సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి.

ఓవరాల్ ప్లస్ పాయింట్స్:

  • మొదటి 10 నిమిషాలు

  • అశ్విన్ బాబు ఘోస్ట్ ఎపిసోడ్

  • ఘోస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక వచ్చే 20 నిమిషాల కామెడీ ఎపిసోడ్

  • అవికా గోర్ క్లైమాక్స్ ఎపిసోడ్

  • కొన్ని థ్రిల్స్

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

  • శివ శంకర్ మాస్టర్, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, గెటప్ శీను(జబర్దస్త్ ఫెమస్ గెటప్ బిల్డప్ బాబాయ్ రోల్), హరితేజ కాంబినేషన్ సీన్స్ అనుకున్నంత వర్కౌట్ కాలేదు. అందువల్ల ఫస్ట్ హాఫ్ బోరింగ్ అనిపిస్తుంది.

  • అస్సలు కథలోకి వెళ్ళకుండా ఓంకార్ తమ్ముడికి హీరో బ్రాండ్ ఇవ్వాలని ట్రై చేసిన ఓవర్ హీరో బ్యాక్ డ్రాప్ సీన్స్.

  • ఫస్ట్ హాఫ్ సన్నివేశాలే బోరింగ్ గా ఉన్నాయిరా అనుకుంటే బోనస్ గా మూడు పాటలు ఉంటాయి. మొదటి పాటని కమర్షియల్ యాంగిల్ లో క్షమించేసినా, మిగతా 2 సాంగ్స్ ఇంకా చిరాకు పుట్టించి ఇంటర్వెల్ కి ముందే మనకు రెండు బ్రేక్స్ ఇస్తాయి.

  • పరమ బోరింగ్ ఇంటర్వల్ బ్లాక్.. ఒక కిక్ ఉండదు, మజా అనిపించదు, మెయిన్ గా సెకండాఫ్ చూడాలి అనే ఆసక్తిని కలిగించదు.

  • సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పక కథ మొదలవుతుంది అక్కడ కామెడీ ఓ 20 నిమిషాలు బాగున్నా ఆ తర్వాత సాగదీసిన రొటీన్ కామెడీ అప్పటి వరకూ నవ్వించారు అన్న ఫీలింగ్ ని కూడా పోగొడుతుంది.

  • ఇక క్లైమాక్స్ అయితే చాలా సిల్లీగా ఫినిష్ చేస్తారు. అస్సలు మనకు ఘోస్ట్ వాళ్ళని ఇబ్బంది పెడుతోంది, దాని చంపడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఏదీ రక్తి కట్టించకపోగా అంతా వీళ్ళకి కంఫర్టబుల్ గా చేసేసుకుంటారా అని ప్రేక్షకులు నిరుత్సాహపడతారు.

ఆఫ్ స్క్రీన్:

  • కథ – ఓంకార్ ఈ సారి హర్రర్ కామెడీ ఫార్మటు పెట్టుకొని జస్ట్ నవ్వించి విజయం అందుకోవాలని ట్రై చేసాడు, అందుకోసం ఏ కథైతే ఏముంది అని తమిళ సినిమా ‘దిల్లుకు దుద్దు 2’ మూవీ ని రీమేక్ గా తీసుకున్నారు. అందులో కాస్త ఫన్ వర్కౌట్ అయ్యింది కానీ ఇక్కడ అదే వర్కౌట్ అవ్వలేదు. ఓంకార్ కి మంచి కథ రాయకలిగే స్కిల్ ఉండి కూడా ఇలాంటి కథ ఎంచుకోవడం ఈ సినిమాకి మొదటి మైనస్. ఘోస్ట్ సినిమాల్లో దెయ్యం ఎమోషన్ అనేదే కథకి చాలా కీలకం. అది కనెక్ట్ అయితే సినిమా హిట్, లేదా ఫట్. ఈ సినిమాలో ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు.

  • కథనం మరొక మైనస్.. రన్ టైం చిన్నదైనప్పటికీ ఒక షార్ట్ ఫిలింలా చెప్పాల్సిన దాన్ని 2 గంటల సినిమాగా సాగదీసి చెప్పిన ఫీలింగ్. కొన్ని థ్రిల్స్, అక్కడక్కడా నవ్వులు ఓకే కానీ సినిమా మొత్తాన్ని మనకి కనెక్ట్ చేసే ఎమోషన్ లేదు. అలాగే ప్రతిదీ మనం ఊహించేయగలం.

  • ఇక డైరెక్టర్ గా ఓంకార్ ఇప్పటివరకూ తనకున్న క్రెడిట్ ని ఇంకా తగ్గించేసుకున్నాడని చెప్పాలి. తన బ్రదర్ అశ్విన్ బాబుని హీరో చేయాలనుకోవడం తప్పులేదు. అలా హీరో చెయ్యాలంటే మాస్ క్యారెక్టర్, ఎలివేషన్స్, హీరోయిన్ తో సాంగ్స్, డాన్సులు ఇలాంటివి ఉన్న లేకపోయినా కథ ఉంటే హీరో అయిపోతాడు అనే చిన్న లాజిక్ ని మిస్ అయ్యాడు. ఓవరాల్ గా డైరెక్టర్ గా ఆడియన్స్ ని 2 గంటలు సీట్లో కూర్చోబెట్టడం లో ఫెయిల్ అయ్యాడు. కనీసం మొదటి రెండు పార్ట్స్ లో ట్రోన్గ్ ఎమోషన్ చెప్పగలిగిన ఓంకార్ ఇందులో అది ఫాలో అవ్వకపోవడం బాధాకరం.

  • గౌతంరాజు గారి ఎడిటింగ్ అంతగా హెల్ప్ అవ్వలేదు. ఉన్న సీన్స్ ని ఆయన షార్ప్ గా కట్ చేసినప్పటికీ వాళ్ళ తీత అలా ఉండడం వల్ల ఆయన కూడా హెల్ప్ చేయలేకపోయాడు.

  • సాయి మాధవ్ గారు కామెడీ అనే భ్రమలో ప్రాసలో పంచ్ లతో రాసిన డైలాగ్స్ పెద్దగా పేలలేదు.

ఓవరాల్ నెగటివ్ పాయింట్స్:

  • పరమ రెగ్యులర్ హార్రర్ కామెడీ కథ

  • సాగదీసి పరమ బోర్ కొట్టించే కథనం

  • కథకి అవసరమైన ఎమోషన్ లేకపోవడం

  • సెకండాఫ్ చివరి 20 నిమిషాలు వర్కౌట్ అవ్వకపోవడం

  • అన్ని హర్రర్ సినిమాల్లోనూ ఉండే పరమ రెగ్యులర్ సీన్స్

  • చాలా సిల్లీగా అనిపించే క్లైమాక్స్

విశ్లేషణ:

‘రాజుగారి గది’ అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది అనేదాన్ని క్యాష్ చేసుకుంటూ ఓంకార్ తెలుగు ప్రేక్షకుల మీదకి మరో రెండు పార్ట్స్ వదిలారు. కానీ 2, 3 వ పార్ట్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. 2వ పార్ట్ లో స్టార్డం ఓపెనింగ్స్ కి హెల్ప్ అయ్యింది కానీ ఇందులో వర్కౌట్ అయ్యే ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం, సినిమా కూడా బాలేకపోవడం ఆడియన్స్ కి చాలా నిరుత్సాహాన్ని ఇస్తుంది. రాజుగారి గది 3′ పరంగా చూసుకుంటే.. కథలేకపోయినా కామెడీ ఉంటే చాలు పాస్ అయిపోవచ్చు అనుకున్న ఓంకార్ ఫార్ములా ప్రేక్షకుల దగ్గర బొక్క బోర్లా పడిందనే చెప్పాలి. మంచి కథ, లేదా ఎదో ఒక పాత్ర స్ట్రాంగ్ ఎమోషన్ లేని కథ చెప్పకపోతే ప్రేక్షకులని మెప్పించలేమని మరోసారి నిజం చేసిన సినిమా ఇది. ఒక్క చోటా కె నాయుడు ప్రతిభని మరోసారి గట్టిగా చెప్పుకునేలాగా ఉంది. ఆయనకి తప్ప మిగతా ఎవరికీ పెద్దగా హెల్ప్ అవ్వదు. చివరిగా ‘రాజుగారి గది 3’ మీరు పెట్టే మనీకి, సమయానికి వర్త్ అనిపించే సినిమా కాదు.

ఫైనల్ పంచ్: రాజుగారి గది 3 – ఇంట్లో కూర్చొని ‘రాజుగారి గది’ చూడడం బెటర్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...
నటీనటులు: అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ తదితరులు. నిర్మాత: ఓఏకె ఎంటర్టైన్మెంట్స్ దర్శకత్వం: ఓంకార్ సినిమాటోగ్రఫీ: చోట కె నాయుడు మ్యూజిక్: షబీర్ ఎడిటర్‌: గౌతం రాజు విడుదల తేదీ: 18 అక్టోబర్ 2019 ఈ మధ్యకాలంలో హార్రర్ కామెడీ సినిమాలు తెలుగులో చాలానే హిట్ అయ్యాయి. అలా హిట్ అయ్యి, తనకంటూ సెపరేట్ పేరు సంపాదించుకున్న సినిమా 'రాజుగారి గది'. దాంతో ఆ పేరుకి సీక్వెల్స్ రావడం మొదలయ్యాయి,...సినిమా రివ్యూ: రాజుగారి గది 3