Switch to English

‘సైరా హిమ్‌ సెల్ఫ్‌’: చిరంజీవితో భేటీపై జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘చిరంజీవిగారితో హృదయపూర్వక భేటీ జరిగింది.. సైరా హిమ్‌ సెల్ఫ్‌.. ఆయన మరిన్ని ఆనందాల్నీ, జ్ఞాపకాల్నీ అందించాలి..’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన పోస్టింగ్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్‌ చిరంజీవితో భేటీ అనంతరం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజ్‌లో పై కామెంట్‌ చేశారు.

ఇంతకీ, ఈ భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయి.? అన్నది మాత్రం తెలియరాలేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినీ అంశాలతోపాటు, రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాని చూడాల్సిందిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి చిరంజీవి సూచించగా, ‘సినిమా గురించి మంచి విషయాల్ని వింటున్నాను.. త్వరలోనే చూస్తాను..’ అని వైఎస్‌ జగన్‌, చిరంజీవికి చెప్పారట. ఈ భేటీలో చిరంజీవి సతీమణి సురేఖ, వైఎస్‌ జగన్‌ సతీమణి భారతి పాల్గొన్నారు. చిరంజీవి దంపతులకు, వైఎస్‌ జగన్‌ దంపతులు ఓ మెమొరబుల్‌ విందు కూడా ఇచ్చారు.

చిరంజీవి దంపతులు, వైఎస్‌ జగన్‌ దంపతుల్ని కలిశాక, చిరంజీవి, వైఎస్‌ జగన్‌ని శాలువాతో సత్కరించారు. మరోపక్క, వైఎస్‌ జగన్‌ కూడా చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు. కుశల ప్రశ్నల అనంతరం ‘సైరా నరసింహారెడ్డి’ ముచ్చట్లు, ఆ తర్వాత రాజకీయ పరమైన మాటలు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో పరోక్షంగా వైఎస్‌ జగన్‌ మీద చిరంజీవి విసుర్లు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.

మరోపక్క, రాజకీయ ప్రత్యర్థిగా చిరంజీవిని భావించి.. అప్పట్లో జగన్‌ సహా వైఎస్సార్సీపీ నేతలు చిరంజీవిపై చేసిన విమర్శల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. ఇదిలా వుంటే, చిరంజీవి – జగన్‌ల మధ్య రాజకీయ విబేధాల్ని పక్కన పెడితే, జగన్‌ – చిరంజీవిని ప్రత్యేకంగా అభిమానిస్తారు. సాక్షి ఛానల్‌ ప్రారంభోత్సవానికి చిరంజీవి హాజరవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా జగన్‌ – చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...