Switch to English

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ సభ్యుల విషయంలో మాట్లాడేటప్పుడు ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి.?

ప్చ్.. ఇవేవీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో కనిపించవు. రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ విషయంలో అయినా అంతే, తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల విషయంలో అయినా అంతే.! మరీ ఇంత నీఛమా.? అంతేనేమో.!

‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు అంటే ఎవరు.?’ అని మొదలెట్టి, తన సోదరి షర్మిల, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు కాదంటూ తీర్మానించేశారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు..’ అంటూ కొన్నాళ్ళ క్రితం ఓ వైసీపీ ఎమ్మెల్యే చాలా దారుణమైన వ్యాఖ్యలు షర్మిల ‘పుట్టుక’పై చేస్తే, అది ఆయన పైత్యం అనుకున్నారంతా.. కానీ, అసలు విషయం ఇదీ.!

వైఎస్ షర్మిల మీద ఆ స్థాయి విమర్శలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇప్పుడు జగన్ వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతోంది. నిజానికి, వైఎస్ జగన్ బహిరంగ సభల్లో ప్రసంగించడంలేదు.. ఎవరో రాసిస్తున్న ప్రసంగాల్ని ఆయన చదువుతున్నారంతే.

మరీ, ప్రసంగాల్లో ఏం రాసుందో అర్థం చేసుకోలేనంత అమాయకుడైతే కాదు కదా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అంతా తెలిసే జరుగుతోంది. అత్యంత అసభ్యకరమైన ప్రసంగాల్ని ఆయనే తయారుచేయించుకుంటున్నారు.

లేకపోతే, పసుపు చీర కట్టుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర మోకరిల్లిందంటూ తన సోదరి వైఎస్ షర్మిల మీద అంతటి దిగజారుడు వ్యాఖ్యల్ని వైఎస్ జగన్ ఎలా చేయగలుగుతారు.? ‘చంద్రబాబు వారసురాలు వైఎస్ షర్మిల’ అని అత్యంత హేయమైన వ్యాఖ్యల్ని వైఎస్ జగన్ ఎలా చేస్తారు.?

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! కానీ, ఇలానా.? మరీ, చెల్లెలి చీర రంగు గురించి రాజకీయ వేదికపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడమా.? చీర కట్టు అంటే, భారతీయ మహిళ ఆత్మగౌరవం.! ఆ చీరకట్టుని అవమానించడమేంటి.?

వస్త్ర ధారణ విషయంలో మహిళల్ని కించపర్చకూడదు. ఆ మాటకొస్తే, మగాళ్ళనైనా కించపర్చకూడదు. ఫలానా రంగు వేసుకోవాలని ఏ రాజ్యాంగమూ ఆదేశించదు. ఏ చట్టంలోనూ అలాంటి నిబంధనలు వుండవు.

పసుపు అంటే, తెలుగు దేశం పార్టీ.. అనే భయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్న వైనం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుంది. పసుపు రంగు శుభప్రదం.! పసుపు అనేది యాంటీబయాటిక్.! పసుపు అనేది ఔషధం.! పసుపు, సంప్రదాయ భారత మహిళ ఆత్మగౌరవం.!

వైఎస్ జగన్ వాలకం చూస్తోంటే, ఇంకోసారి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో మహిళలెవరూ పసుపు చీరలు కట్టుకోకూడదనే నిబంధనలు తీసుకొస్తారేమో.! వైఎస్ షర్మిల చీర రంగుపై వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి అయినా హర్షిస్తారని అనుకోలేం.!

దిగజారడంలో ఇది వేరే లెవల్.! పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసే క్రమంలో వైఎస్ జగన్, తన సోదరి షర్మిల చీర రంగు మీద చేసిన కామెంట్, రాజకీయంగా వైఎస్ జగన్ స్థానికి పాతాళానికంటే ఇంకా చాలా లోతుగా పాతరేసింది. సోదరుడి పైత్యపు వ్యాఖ్యలపై సోదరి షర్మిల ఎలాంటి కామెంట్స్ చేస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...