Switch to English

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక ఇంకెవరికి దక్కుతుంది.? అసలు షర్మిల, రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదంటూ వైఎస్ జగన్ తల్లి విజయమ్మని అవమానించిన నాయకులున్నారు వైసీపీలో.!

సొంత కుటుంబంలో రక్త సంబంధాల్నే ఇంతలా అవమానించిన వైసీపీ మూకలు, ఇంకెవర్నయినా బతకనిస్తారా.? అసలు వైసీపీ రాజ్యాంగమేంటో, వైసీపీ మూకలకి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారోగానీ, సభ్య సమాజాన్ని అస్సలు బతకనిచ్చే పరిస్థితే కనిపించడంలేదు వైసీపీ పాలనలో.!

మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారు.? తనకు అత్యంత సన్నిహితులైన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్, సీఎం రమేష్.. ఎన్నికల బరిలో వున్నారు.. వారిని గెలిపించండి.. అని పిలుపునిచ్చారంతే. ప్రజాస్వామ్యంలో ఓ వ్యక్తి స్వేచ్ఛగా తన అభిప్రాయాల్ని చెప్పే అవకాశం వుంది కదా.?

ప్చ్.. ఇది వైసీపీ రాజ్యాంగం.! ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది.? వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల్నే (తల్లి, చెల్లి) వదలడంలేదు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చిరంజీవిని వదులుతారా.? మూక దాడి షురూ అయ్యింది. అత్యంత అసభ్యకరంగా బూతు పురాణం షురూ చేశారు వైసీపీ మద్దతుదారులు.

ఇంతా చేసి, ఇదేమన్నా వైసీపీకి లాభమా.? ఛాన్సే లేదు.! వైసీపీలోనే చాలామంది ఈ తీరు పట్ల విస్తుపోతున్నారు. తమ పార్టీ కనుసన్నల్లో తయారవుతున్న అల్లరి మూకలు, ఇంతలా సభ్య సమాజం మీద విరుచుకుపడుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు.

వైసీపీని నేతలు ఎందుకు వీడుతున్నారంటే, వాళ్ళు చెబుతున్న కారణమొక్కటే. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిడితేనే టిక్కెట్లు..’ అని వైసీపీ అధినాయకత్వం షరతులు పెడుతోందిట. నాయకులకే ఇలాంటి షరతులు పెడితే, వైసీపీ పెంచి పోషిస్తున్న మూక పరిస్థితేంటి.?

సమాజానికి వైసీపీ అత్యంత హానికరం.. అనే మెసేజ్, వైసీపీ మూకలు, చిరంజీవిపై చేస్తున్న బూతుల దాడితో ఇంకోసారి నిరూపితమయ్యింది. నిన్న మొన్నటిదాకా ఒకరిద్దరు మెగాభిమానులెవరన్నా వైసీపీ పట్ల కాస్త సానుకూలంగా వుంటే, ఆ అవకాశమూ ఇప్పుడు వైసీపీకి లేకుండా పోయింది.!

ఈ పద్ధతి నచ్చక, రేప్పొద్దున్న వైఎస్ జగన్ సతీమణి భారతి ఏమైనా వైసీపీకి ఎదురు తిరిగితే, ఆమెకీ షర్మిల తరహాలోనే వైసీపీ మూకల ట్రీట్మెంట్ వుంటుందా.? ఏమో, అంతేనేమో… అంటూ వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. రాజకీయమంటే, ప్రజా సేవ.! కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే ‘మూక దాడులు’.!

అత్యంత అసభ్యకరమైన రీతిలో, అసహ్యకరమైన రీతిలో వైసీపీ చేస్తున్న రాజకీయం.. నిజంగానే సభ్య సమాజానికి అత్యంత హానికరం.! వ్యక్తులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసే అవకాశం లేనప్పుడు.. అది ప్రజాస్వామ్యమెలా అవుతుంది.? ఈ మాత్రం ఇంగితం వుంటే, అది వైసీపీ ఎలా అవుతుంది.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...