Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: వరుణ్‌ మైండ్‌ బ్లాంక్‌ చేసిన పునర్నవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

బిగ్ హౌస్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పుడే వాతావరణం వేడెక్కించేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో భాగంగా, మొదటి రోజే నామినేట్‌ అయిన వరుణ్‌ సందేశ్‌కి సేఫ్‌ జోన్‌లోకి వెళ్లేందుకు బిగ్‌బాస్‌ ఓ ఛాన్సిచ్చారు. ఆయన నామినేషన్‌ని ఇంకో హౌస్‌మేట్‌తో రీప్లేస్‌ చేసే ఛాన్స్‌ అది. అందుకు సరైన కారణం చెప్పాలి. మానిటర్‌ హేమ సారధ్యంలో ఇదంతా జరగాలి. ఆ క్రమంలో వరుణ్‌ తన ప్లేస్‌ని పునర్నవితో రీప్లేస్‌ చేయాలనుకున్నాడు. అందుకు ఆయన చెప్పిన కారణం, పునర్నవి హౌస్‌లో అందరితోనూ సక్రమంగా కలవలేకపోతోందనీ, తన పని తాను కామ్‌గా చేసుకెళ్లిపోతోంది. కానీ, అందరితోనూ మింగిల్‌ కావడం లేదనీ, అంతే కాదు, ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా.. అన్న చందంగా గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తోందనీ వరుణ్‌ చెప్పాడు.

అయితే, వరుణ్‌ తన గురించి చెబుతున్నప్పుడు పునర్నవి ముఖ కవళికలు ఆసక్తిని కనబరిచాయి. పాపం చిన్న పిల్ల కదా అనుకున్న వారికి, చిన్న సైజు అమ్మోరు తల్లిలా కనిపించిందీ చిన్న పాప. ఆయన చెప్పడం పూర్తి అయినాక, తన వెర్షన్‌ని కూడా మానిటర్‌ ముందుంచింది పునర్నవి. అయితే, ఆ వెర్షన్‌ని చాలా పవర్‌ఫుల్‌గా ఎక్స్‌ప్రెస్‌ చేసింది. తానేం గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వడం లేదనీ, తాను కూడా హౌస్‌ మేట్స్‌తో బాగానే కలిసిపోతున్నాననీ, అయినా ఒక్కరోజులో అంతకన్నా ఎక్కువ ఇంకెలా క్లోజ్‌ కాగలమనీ.. కొంచెం ఘాటుగా వరుణ్‌పై విరుచుకుపడింది.

ఆమెలోని ఆ యాంగిల్‌ చూసిన వీక్షకులు, సీన్‌లో ఉన్న హౌస్‌ మేట్స్‌ పునర్నవి ఆటిట్యూడ్‌కి ఆశ్చర్యపోవడమే వారి పనైంది. ఇక వరుణ్‌ సందేశ్‌కి అయితే, దిమ్మ తిరిగి బొమ్మ కనబడినంత పనయ్యింది. ఇద్దరి వెర్షన్స్‌ విన్న మానిటర్‌ హేమ వరుణ్‌కే తన సపోర్ట్‌ ఇచ్చింది. అలా పునర్నవి ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యింది.

మొత్తానికి రెండో రోజు ఎలిమినేషన్‌ నామినేషన్స్‌ వ్యవహారంతో బిగ్‌బాస్‌ కాస్త వాడి వేడిగానే సాగింది. రెండో రోజుకే హౌస్‌లో ఇంత హీట్‌నెస్‌ చూసిన బిగ్‌బాస్‌ మూడో రోజును కూల్‌ చేయాలనుకున్నారు కాబోలు. హౌస్‌ మేట్స్‌కి చిన్న పిల్లల టాస్క్‌ని సిద్ధం చేసి ఉంచారు. ఈ చిన్న పిల్లల టాస్క్‌లో ఎవరెవరు ఎలాంటి పర్‌ఫామెన్స్‌ ఇచ్చారో చూడాలంటే స్టే ట్యూన్డ్‌.. ఫర్‌ థర్డ్‌ డే బిగ్‌బాస్‌ సీజన్‌ 3.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....