Switch to English

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఫియర్”

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న “ఫియర్” మూవీ ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నటులు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా…డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

హీరోయిన్ వేదిక మాట్లాడుతూ – ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది. నేను తెలుగులో కాంచన, రూలర్ సినిమాల్లో నటించాను. ఓ వెబ్ సిరీస్ చేశాను కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కథలో నటించలేదు. డైరెక్టర్ హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ కథ నాకు చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. స్టోరీ, క్యారెక్టర్స్ డిజైన్ లో హరిత చాలా క్లారిటీగా ఉన్నారు. కొత్త డైరెక్టర్ అని నాకు అనిపించలేదు. దత్తాత్రేయ మీడియా సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉంది. అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ తో ఫియర్ మూవీ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అని చెప్పింది

డైరెక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ – డైరెక్షన్ చేయడం అనేది నా డ్రీమ్ కాదు డెస్టినీ అనుకుంటాను. దత్తాత్రేయ మీడియా నా ఫ్యామిలీ బ్యానర్ లాంటిది. ఇవాళ మా ఫియర్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుంది అనేది ఆలోచిస్తూ ఏడాదిపాటు ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ స్క్రిప్టుకు వేదిక లాంటి మంచి హీరోయిన్ దొరకడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ఎంతో ఎంకరేజింగ్ గా ఉంది. మంచి టీమ్ నాకు దొరికింది. వీరి సహాయంతో నేను అనుకున్న స్క్రిప్ట్ తో ఇన్ టైమ్ లో సినిమా రూపొందించి ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాను. అని చెప్పింది.

నిర్మాత ఏఆర్ అభి మాట్లాడుతూ – హరిత నా వైఫ్. మా సంస్థలో లక్కీ లక్ష్మణ్ సినిమాకు వర్క్ చేసింది. ఆ మూవీకి చాలా క్రాప్ట్స్ సూపర్ విజన్ చేసేది. ప్రతి పనిలో డెడికేటెడ్ గా ఉంటుంది. ఆమె డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం ఉంది. ఫియర్ స్క్రిప్ట్ ను చాలా బాగా రాసుకుంది. ఆ స్క్రిప్ట్ ను యాక్సెప్ట్ చేసి హరితకు సపోర్ట్ చేస్తున్న వేదిక గారికి థ్యాంక్స్. ఆమె ఛాలెంజింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. అలాగే అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. తను హీరో అయినా..మేము ఈ స్క్రిప్ట్ చెప్పగానే ఓకే అని చేసేందుకు ముందుకొచ్చాడు. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు మురళీ మోహన్, కరుణాకరన్, తేజ కాకుమాను, హీరో సోహైల్..అందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ – ఫియర్ మూవీలో ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నాను. డైరెక్టర్ హరిత గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా ప్రతి సీన్ కళ్ల ముందు చూస్తున్నట్లు అనిపించింది. ఈ మూవీలో పార్ట్ అ‌వడం హ్యాపీగా ఉంది. మా సినిమా బ్యానర్ లో రాసినట్లు..ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీగా ప్రేక్షకులకు అందిస్తాం. వేదిక గారితో కలిసి పనిచేస్తున్నాను. అలాగే నా ఫేవరేట్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ గారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అనూప్ గారు మంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఒక సాంగ్ ఆల్రెడీ విన్నాను. అద్భుతంగా వచ్చింది. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ మాట్లాడుతూ – నేను ప్రొడ్యూసర్ అభితో లక్కీ లక్ష్మణ్ మూవీ చేసాను. ఇప్పుడు హరిత గారి డైరెక్షన్ లో ఫియర్ కు వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పటిదాకా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి పనిచేయలేదు. ఈ సినిమా కోసం ఒక కొత్త లైటింగ్ ప్యాట్రన్, షాట్స్ ట్రై చేస్తున్నాను. వేదికతో నేను వర్క్ చేస్తున్న రెండో మూవీ ఇది. ఫియర్ మీకు నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నాను. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...