Switch to English

‘మా ఊరి పోలిమేర 2’ ట్రైలర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మా వూరి పోలిమేర‘కు సీక్వెల్ గా రాబోతున్న చిత్రం మా వూరి పోలిమేర 2. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో నచ్చిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుతో కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన దర్శకుడు హరీష్ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత బన్నీవాస్ లు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ఓటీటీలో పోలిమేర 1 బాగుందని చాలా మంది చెప్పారు. చూడగానే నాకు కూడా బాగా నచ్చింది. కంటెంట్ చాలా బలంగా వుంది. పోలిమేర 2 కూడా అదే తరహాలో బాగుంటుందని అనుకుంటున్నాను. బన్నీవాసుతో నాకు మంచి రిలేషన్ వుంది. ఆయన ఈ సినిమాకు సపోర్ట్ గా వుండి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం దర్శకుడికి సినిమాలంటే ఎంత ఇష్టమో ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మంచి తెలుగు టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతినిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాతో ఇందులో పార్ట్ అయిన నటీనటులకు సాంకేతిక నిపుణుల అందరికి మంచి పేరు వస్తుంది‘ అన్నారు. బన్నీవాస్ మాట్లాడుతూ ’నాకు నచ్చి నేను ఈ సినిమాకు సపోర్ట్ చేస్తాను. వంశీ చేస్తున్న తొలి సినిమా ఇది. 2018 సినిమాను చూసి తెలుగులో మనం విడుదల చేద్దామని సజెస్ట్ చేసిన వంశీ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. అతని జడ్జ్ మెంట్ పై నాకు నమ్మకం వుంది. ఇది చాలా చిన్న కథ తప్పకుండా అందిరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. సత్యం రాజేష్ కు కెరీర్ కు బాగా ప్లస్ అవుతుంది. పోలిమేర 3 కూడా వుంటుంది. మొదటి పార్ట్ చూడని వాళ్లకు కూడా పోలిమేర 2 అర్థమయ్యేటట్లు స్క్రీన్ ప్లే వుంటుంది. ఈ సినిమా అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పోలిమేర2 కు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. హీరో కార్తీకేయ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ పై చూస్తే చాలా మంచి అనుభూతికి లోనవుతారు. చాలా కష్టపడి చేసిన సినిమాలా అనిపిస్తుంది. తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ నాకు అండగా వుంటూ, ఈ రోజు నేను ఈ స్థాయిలో వున్నానంటే బన్నీవాస్ కారణం. సినిమాను తప్పకుండా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అని తెలిపారు. గౌరికష్ణ మాట్లాడుతూ ఇలాంటి చిన్న సినిమాలకు అండగా వుండే బన్నివాస్, వంశీ నందిపాటి గారికి అభినందనలు, సినిమా విజయంపై మంచి నమ్మకం వుంది. నిజాయితీగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ ఈ సినిమా వంశీ నందిపాటికి నచ్చడంతో ఈ సినిమా ప్రయాణం ఇక్కడి వరకు రావడం ఆనందంగా వుంది. అన్నారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ హరీష్ శంకర్, కార్తికేయ, బన్నీవాస్ గారు ఈ వేడుకకు రావడం పాజిటివ్ గా అనిపిస్తుంది పార్ట్ 1కు మించి పార్ట్ 2 వుండబోతుంది. వంశీ నందిపాటి సినిమాను విడుదల చేయడం ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమాను పార్ట్ 1కు 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు. బాలాదిత్య మాట్లాడుతూ నేను రాజేష్ సినీ పరిశ్రమకు వచ్చి
20 సంవత్సరాలైంది పోలిమేర చూసిన ప్రతి ఒక్కరూ పార్ట్ 2 ఎప్పుడూ అని అడిగారు. పార్ట్ 1కు మించి ఎన్నో రెట్లు అద్బుతంగా వుంటుంది. పార్ట్ 1ను చూడనివాళ్లు తప్పకుండా చూసి పార్ట్ 2కు వస్తే మీ మెదళ్లకు చాలా పని వుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఈ సినిమాలో వుంటాయి. సత్యం రాజేష్ ఈ సినిమాతో పర్ ఫార్మెర్ అని నిరూపించుకున్నాడు‘ అన్నారు. ఈ వేడుకలో ఖుషేందర్, గెటప్ శీను, కామాకి, సాహితి
గ్యానీ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...