Switch to English

Annapurna Photo Studio: అన్నపూర్ణ ఫోటో స్టూడియో థర్డ్ సాంగ్ లాంచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Annapurna Photo Studio: పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వంలో.. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు లావణ్య జంటగా నటించిన సినిమా. గతంలో విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ తోపాటు రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు సుహాస్ చేతుల మీదుగా మరో పాటను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో నుంచి పాట లాంచ్ చేశాం. నా చేతుల మీదుగా ఒక పాట విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. పాట చాలా బావుంది. తక్కువ బడ్జెట్ అయినా.. హై క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి. హీరో చైతన్య, చెందు ముద్దుతో పాటు మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను..” అలాగే నిర్మాత యష్ గారికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ” వాల్యూబుల్ టైమ్ ఇచ్చి మా పాట విడుదల చేసి సుహాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో మొదటగా వచ్చే పాట ఇది. సినిమాలో ఊరికీ ఓ పాత్ర ఉంటుంది. ఆ ఊరి పాత్రను ఎస్టాబ్లిష్‌ చేస్తూ సాగే పాట ఇది. ఆ ఊరు ఎలాంటిది.. అక్కడి మనుషులు ఎలాంటివాళ్లు అనేది ఈ పాటలో కనిపిస్తుంది. ఈ పాటకు ప్రిన్స్ హెన్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ ట్యూన్ కు తగ్గట్టుగా మంచి లిరిక్స్ ఇచ్చాడు శ్రీనివాస్ మౌళి. పంకజ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది మా నిర్మాత యష్ గారికి చాలా థాంక్స్ అన్నారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ… ” మా సినిమాలో మొదటగా వచ్చే ఈ పాట సుహాస్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మేమిద్దరం చాలాకాలంగా ఫ్రెండ్స్. తను నటించిన అంబాజీ పేట పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సుహాస్ కు థ్యాంక్స్. ఈ పాటను మౌళిగారు అద్భుతంగా రాశారు. మంచి ట్యూన్ కుదిరింది.అందరికీ థ్యాంక్యూ సో మచ్ అలాగే మా యష్ గారు ప్రమోషన్స్ బాగా ప్లాన్ చేసారు అన్నారు.

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. ” అన్నపూర్ణ ఫోటో స్టూడియోనుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ చేసినందుకు సుహాస్ గారికి థ్యాంక్స్. ఇంతకు ముందు వచ్చిన రెండు పాటలను బాగా ఆదరించారు. అలాగే ఈ పాట కూడా మీ అందరికీ అంతే బాగా నచ్చుతుంది. ఒక మంచి ట్యూన్ కు తగ్గట్టుగానే మంచి లిరిక్స్ కూడా కుదిరాయి. డివోపి పంకజ్ గారు, డైరెక్టర్ చందు మరియు నిర్మాత యష్ గారికి థ్యాంక్స్..” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ.. ” పాట విడుదల చేసిన సుహాస్ గారికి థ్యాంక్యూ. ఒక మంచి అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ గారికి థ్యాంక్యూ. మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే పాట ఇది.అలాగని రెగ్యులర్ ఫోక్ సాంగ్ లా ఉండదు. అందుకు తగ్గట్టుగా మౌళిగారు మంచి సాహిత్యం రాశారు. సాయి చరణ్‌ అంతే బాగా పాడారు. అన్ని రకాలుగా ది బెస్ట్ ఇచ్చాం. మీరు విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను..” అన్నారు.

లిరిసిస్ట్ శ్రీనివాస మౌళి మాట్లాడుతూ.. ” ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశాను. ఇందుకు చెందుగారికి థ్యాంక్స్. నిర్మాత యశ్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. దర్శకుడు చెప్పినదాన్ని బట్టి సినిమాలో ఊరు కూడా ఒక పాత్ర. అందుకు తగ్గట్టుగా ఊరు జాగ్రఫీ, విజువల్స్ ఉండాలి.. కథ గురించి చిన్న గ్లింప్స్ కూడా ఉండాలన్నారు. పాటలో మొదటి లైన్ కే ఆయన సంతోషించారు. తర్వాత మంచి మంచి పోలికలతో ఈ పాటను చేశాం..” అన్నారు.

సినిమాటోగ్రాఫర్ పంకజ్ మాట్లాడుతూ.. “ఈ పాటలోని సాహిత్యాన్నిబట్టి చూస్తే దీన్ని సుహాసే విడుదల చేయాలి. పాట ఎంత అందంగా ఉందో.. సుహాస్ మనసూ అంతే అందంగా ఉంటుంది. ఇక ఈ సాంగ్ పిక్చరైజ్ చేయడానికి చాలా లొకేషన్స్ తిరిగాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...