Switch to English

Jr Ntr Birthday Specials: చిన్న వయసులోనే పొలిటికల్ సునామీ.. ‘జూనియర్ ఎన్టీఆర్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Jr Ntr Birthday Specials: జూనియర్ ఎన్టీఆర్.. కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా సేలబిలిటీ ఉన్న పేరు ఇది. కనిపించే మూడు సింహాలు నటన.. కనిపించని నాలుగో సింహమే రాజకీయం అనేంత క్రేజ్ ఎన్టీఆర్ సొంతం. నందమూరి వంశం, నట వారసత్వం, డైలాగుల్లో స్పష్టత, భారీ ఇమేజ్, తాత ఎన్టీఆర్ తో పోలిక.. ఇవి ఎన్టీఆర్ కు వరాలు. తెరంగేట్రం చేసిన రెండేళ్లలోనే సంచలనాలు నమోదు చేసిన ఎన్టీఆర్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి లేకపోయినా రావాలనే కోరిక సగటు ఎన్టీఆర్ అభిమానిలో ఉంది. రాజకీయాలపై తన సత్తా ఏంటో 2009 ఎన్నికల్లో చూపాడు ఎన్టీఆర్. అప్పటివరకూ స్తబ్దుగా సాగుతున్న ఎన్నికల వేడిని హెలికాఫ్టర్ నుంచి బస్సుపై దిగీదిగడంతో అద్భుతాలు చేశాడు. తన వాగ్దాటితో పలికిన రాజకీయ డైలాగులు సమీప రాజకీయ పార్టీలకు సెగలు పుట్టించాయంటే అతిశయోక్తి కాదు.

తాతకు తగ్గ మనవడిలా..

అప్పటికి 9ఏళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ 2004లో కాంగ్రెస్ గాలిలో ఓటమి చవిచూసింది. వైఎస్ హవాతో ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల్లోకి రావాలంటే పార్టీకి సినీ గ్లామర్ అవసరమైంది. దీంతో ఎన్టీఆర్ ను రంగంలోకి దించింది టీడీపీ. 1983లో సీనియర్ ఎన్టీఆర్ ఖాకీ దుస్తుల్లో ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్లినట్టే ఆయన మనవడు ఎన్టీఆర్ కూడా అదే చేశారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. టీడీపీకి మళ్లీ ఆశలు చిగురించేలా చేశారు. మొత్తంగా 2009 ఎన్నికల్లో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచాడు ఎన్టీఆర్ . ఫలితాలు తారుమారైనా 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ సృష్టించిన రాజకీయ ప్రభంజనం సగటు తెలుగు ప్రజలు మరిచిపోలేరు. ప్రచారంలో భాగంగా భారీ ప్రమాదానికి గురైనా ఆసుపత్రిలో బెడ్ మీద నుంచే ప్రచారం చేశాడు ఎన్టీఆర్.

భవిష్యత్తులో..

ఆ తర్వాత మారిన అనేక పరిణామాల్లో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున ప్రచారం చేయలేదు. అయితే.. పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఉందనే వాదన ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రసంగం, పర్యటనల్లో కూడా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఆయన్నకలుపుకుని వెళ్లాలనే నినాదాలు హోరెత్తుతూనే ఉంటాయి. ఓదశంలో తెలంగాణలో టీడీపీకి ఎన్టీఆర్ ని అధ్యక్షుడిగా ప్రకటించాలనే నినాదం చంద్రబాబు ముందే వచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. చిన్న వయసులోనే నటనలో ఎంత పరిపక్వత ఉందో.. రాజకీయాల్లో కూడా అంతే పరిపక్వత. ఇప్పటికైతే రాజకీయాలపై కాకుండా.. నటన, సినిమాలపైనే దృష్టి పెడతున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది కాలమే సమాధానం చెప్పాల్సిన అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...