Switch to English

పవన్ కళ్యాణ్ నాయకుడు.. అనుకున్నది సాధిస్తాడు: మెగాస్టార్ చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి ‘నిజం’ అనే టాక్ షో‌లో సందడి చేశారు. సింగర్ స్మిత ఈ టాక్ షో హోస్ట్.! మెగాస్టార్ చిరంజీవి.. అంటే, తెరచిన పుస్తకం. కానీ, ఇంకా తెలియని విషయాలు చాలానే వున్నాయ్.

కొణిదెల శివశంకర్ వరప్రసాద్ ఎలా చిరంజీవిగా మారారు.? అంటే, సినిమాల్లోకొచ్చి పేరు మార్చుకున్నారనడం చాలా తేలిక. కానీ, స్కూల్ విద్య అభ్యసిస్తున్నప్పుడే నటనపై ఆసక్తి పెరగడం దగ్గర్నుంచి, చెన్నయ్ వెళ్ళి సినిమాల్లో ప్రయత్నించడందాకా.. అక్కడి నుంచి.. సినీ రంగంలో ఎదురైన అవమానాలు, కఠిన పరిస్థితులు.. వీటిని తట్టుకుని నిలబడి, మెగాస్టార్‌గా ఎదిగేవరకూ.. మెగాస్టార్ అయ్యాక కూడా ఆ స్టార్‌డమ్‌ని ఓ బాధ్యతగా భావించి.. మరింత కష్టపడటం వరకు.. చిరంజీవి అంటే ఎవరెస్ట్ శిఖరం.!

ఔను, ఆ శిఖరాన్ని కూల్చేయడం ఇంకెవడికీ సాధ్యం కాదు. ఎందుకంటే, తనంతట తానుగా ఎదిగిన శిఖరమది. సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువ కదా.? అనడిగితే, ‘ఔను, రెండు శాతం కావొచ్చు.. జీరో పాయింట్ టూ శాతం కావొచ్చు.. అది నాదే.. అనుకుని కష్టపడేవాళ్ళకు పరిశ్రమలో తిరుగుండదు..’ అంటూ చిరంజీవి చెప్పిన మాట.. ఓ పాఠం.. ఓ స్ఫూర్తి.

సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో ‘నీ కులం ఏంటి.? అనడిగి.. ఫలానా కులం అని చెప్పగానే, అయితే కష్టం..’ అని తన ఆశలపై నీళ్ళు చల్లిన సంఘటన గురించి చెప్పినప్పుడు చిరంజీవి కళ్ళు చెమర్చాయి.

ప్రజారాజ్యం పార్టీ పెట్టి 70 లక్షల ఓట్లు సాధించిన చిరంజీవి, రాజకీయాల్లో ఎందుకు వుండలేకపోయారు.? అంటే, ‘ప్రజలు ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకునే పరిస్థితి వుంది.. నేను డబ్బుతో రాజకీయాలు చేయాలనుకోలేదు.. అందుకే, ఈ రాజకీయ వ్యవస్థలో ఇమడలేకపోయాను..’ అని కుండబద్దలుగొట్టేశారు.

పవన్ కళ్యాణ్‌ని నటుగా ఇష్టపడతారా.? రాజకీయ నాయకుడిగా ఇష్టపడతారా.? అంటే, తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని నాయకుడిగా అభివర్ణించారు. ‘పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు. సమాజానికి ఏదైనా చేయాలన్న కసితో వుంటాడు.. చేస్తాడు, ధైర్యవంతుడు, నిలబడతాడు..’ అని చిరంజీవి చెప్పారు.

‘హీరోలకి అభిమానులుంటారు.. కానీ, పవన్ కళ్యాణ్‌కి భక్తులుంటారు.. ఆ కల్ట్ అభిమానుల లెక్కే వేరు..’ అంటూ తమ్ముడి గురించి చెబుతూ చిరంజీవి ఉప్పొంగిపోయారు.

వేదికలపై ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం ఇష్టమా.? వెండితెరపై నటుడిగా అలరించడం ఇష్టమా.? అనడిగితే, ‘వెండితెరపై అలరించడంలో వుండే కిక్కే వేరప్పా..’ అంటూ పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ చేసి చూపించారు చిరంజీవి. ‘మీడియాకెక్కి ఎవరెవరో నా గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. నా ఆనందాన్ని వాడు చెడగొట్టడాని బాధపడితే.. మన ఆనందానికి అవతలి వ్యక్తిని అధిపతిని చేసినట్లవుతుంది.. అది నాకు ఇష్టం వుండదు. అందుకే, నేను వాటిని పట్టించుకోను. నా పేరు చెప్పుకుని పాపులారిటీ పెంచుకోవాలనుకునేవారిని నేనస్సలు పట్టించుకోను’ అంటూ తనదైన అభిప్రాయాన్ని చిరంజీవి కుండబద్దలుగొట్టేశారు.

తన సినిమాల్లో నెంబర్ వన్.. అని ‘ఖైదీ’ని పేర్కొన్న చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించడం చాలా సరదాగా వుండేదనీ, ఎన్టీయార్‌తో కలిసి నటించినప్పుడు ప్రొఫెషనల్‌గా అనిపించిందనీ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రాధికని బెస్ట్ డాన్స్ పార్టనర్‌గా చెబుతూ, శ్రీదేవి డాన్స్ చాలా అందంగా వుంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. విజయశాంతి నటన పవర్‌ఫుల్‌గా వుంటుందనీ, రాధిక నటన సహజంగా వుంటుందనీ వివరించారు.

కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమలో కార్మికులు ఇబ్బంది పడినప్పుడు, సీసీటీ ద్వారా ఛారిటీ చేపట్టామనీ, ఈ క్రమంలో నాగార్జున, మహేష్.. ఇలా ప్రతి ఒక్కరూ సహకరించడంతో, కార్మికుల్ని ఆదుకోగలిగామనీ, అది చాలా సంతృప్తినిచ్చిందని చిరంజీవి చెప్పారు.

పవన్ కళ్యాణ్‌కి చిన్నప్పటినుంచీ గన్స్ అంటే ఇష్టమనీ, ఓ సారి గన్‌తో వెళుతోంటే రైల్వే స్టేషన్‌లో ఆపారనీ, అది డమ్మీ గన్ అని తెలిసి ఆ తర్వాత వదిలేశారనీ.. మొదటి నుంచీ రెబల్ భావాలు పవన్ కళ్యాణ్‌లో వున్నాయంటూ తమ్ముడి గురించి అన్నయ్య ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

‘మెగాస్టార్ అనేది ఓ బాధ్యత.. అలాగని, అది శాశ్వతం కాదు..’ అంటూ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘బింబిసార’ సినిమా విషయంలో ‘మెగాస్టార్’ని కళ్యాణ్ రామ్ పేరుకి తగిలించి కొందరు పైశాచికానందం పొందిన సంగతి తెలిసిందే.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...