Switch to English

ప్చ్.! వైఎస్ జగన్ మళ్ళీ నవ్వులపాలవుతున్నారే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అనీ చంద్రబాబులా, చంద్రబాబు దత్త పుత్రుడు మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను అనననీ, ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడి ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం, ఇక్కడే నా రాజకీయం, ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం..’ అని గట్టిగా నినదించేశారట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.!

అరరె, కాంగ్రెస్ పార్టీని కాదని కదా.. సొంత కుంపటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టుకున్నది. ఆ లెక్కన, వైఎస్ జగన్ కూడా పార్టీ మారినట్లే అవుతుంది కదా.! ‘ఆ పార్టీని కాదని ఈ పార్టీ..’ అని వైఎస్ జగన్, తనను తానే విమర్శించుకుని, తూలనాడుకున్నట్టుంది వ్యవహారం.

ఇక, ‘ఈ భార్య కాకపోతే మరో భార్య’ అన్న విమర్శ, దత్త పుత్రుడి పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేశారు గనుక, ఆ దత్త పుత్రుడు వైసీపీ దృష్టిలో ఎవరన్నది అందరికీ తెలుసు. అది పవన్ కళ్యాణ్ మీద పనిగట్టుకుని వైసీపీ చేసే పసలేని విమర్శ.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే బావుండదు.. అని పలు సందర్భాల్లో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఆపాటి విజ్ఞత వైసీపీ అధినేతకు లేకుండా పోయింది. ‘మీ ఇంట్లో ఆడవాళ్ళని నేను అవమానించను..’ అని పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూనే వున్నారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం, పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడవాళ్ళ గురించి ప్రస్తావిస్తుంటారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, కొన్నాళ్ళు తెలంగాణలో వైఎస్సార్సీపీని కొనసాగించి, ఆ తర్వాత అక్కడ దుకాణం సర్దేసి, తెలంగాణలో చెల్లెలు షర్మిలతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘అక్కడ మకాం.. ఇక్కడ మకాం’ అంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

అయినా, ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు, చూసి చదవడమేంటబ్బా.? అది చాలదన్నట్టు, ఇతరుల భార్యల గురించి మాట్లాడటం వల్ల ప్రజలకేంటి ప్రయోజనం. అన్న కనీస ఇంగితాన్ని కూడా స్క్రిప్టు రాసేవాళ్ళు పాటించడంలేదు.. అది చదివే ముఖ్యమంత్రికీ ఆ విజ్ఞత వుండటంలేదు.

గతంలో జనసేన అధినేత చెప్పు చూపించి మరీ హెచ్చరించారు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దని. కానీ, వైఎస్ జగన్ పదే పదే అదే ప్రస్తావన ఎందుకు చేస్తున్నట్టు.? జనంలో నవ్వులపాలవడం తప్ప, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ వ్యాఖ్యల వల్ల ఒనగూడే రాజకీయ ప్రయోజనమేముంటుంది.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...