Switch to English

దిల్ రాజు.! అందగాడు, ఆటగాడే కాదు, వేటగాడు కూడా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అరరె.! ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనకు గ్లామరెక్కువైపోయిందని అంటున్నాడే.! అయ్యోపాపం, అలాగైతే సినిమా హీరోగా ట్రై చేసెయ్యొచ్చు కదా.?

ఎప్పటినుంచో దిల్ రాజుని చాలామంది మీడియా ప్రతినిథులు ‘హీరోగా ట్రై చేయొచ్చు కదా’ అని అడుగుతుంటారు. బహుశా ఆ కోరిక ఆయనలోనూ బలంగా వుండబట్టే, ‘గ్లామరెక్కువైపోయింది’ అని స్వకుచ మర్ధనం చేసుకుంటున్నారు దిల్ రాజు.

అసలు ఈ గ్లామర్ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చినట్లు.? అంటే, ఈ మధ్య దిల్ రాజు పేరు మార్మోగిపోతోంది. సినీ పరిశ్రమలో నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో ఆ మధ్య కొన్నాళ్ళపాటు షూటింగులు బంద్ చేసేసుకున్నారు. అప్పట్లో అన్ని సినిమాల షూటింగులూ ఆగిపోయాయ్.. ఒక్క దిల్ రాజు సినిమాలు తప్ప.

తెలుగు సినిమాలే అన్నాడు.. తమిళ సినిమాలని బుకాయించాడు..

స్ట్రెయిట్ తెలుగు సినిమాయేనంటూ ‘వారిసు’ గురించి చెప్పుకొచ్చాడు దిల్ రాజు అంతకు ముంది. కానీ, టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్ బంద్ సమయంలో ‘వారిసు’ షూటింగ్ జరిగితే, ‘అది తమిళ సినిమా’ అని చెప్పాడు. ఆ తర్వాత దాన్ని ద్విభాషా చిత్రమన్నాడు.

దిల్ రాజు మాటలు ఇలాగే వుంటాయి. గతంలో, సంక్రాంతి పండగకి డబ్బింగ్ సినిమాలెలా తెస్తారు.? అంటూ ప్రశ్నించాడు దిల్ రాజు. అది గతం. ఇప్పుడేమో, డబ్బింగ్ సినిమా ‘వారిసు’ని, ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల నెత్తిన దిల్ రాజు బలవంతంగా రుద్దున్నాడు.

తెలుగు సినీ పరిశ్రమలో ఆటగాడూ అతనే.. వేటగాడూ అతనే అన్నట్లు తయారైంది పరిస్థితి. చిరంజీవి, బాలకృష్ణకే దిల్ రాజు కారణంగా ఇప్పుడు సంక్రాంతికి సరైన థియేటర్లు దొరకని పరిస్థితి. ముఖ్యమైన థియేటర్లు మీకే వస్తాయ్ కదా.? అని ప్రశ్నిస్తే, ‘అది గుడ్ విల్..’ అంటూ తనదైన అహంకారం ప్రదర్శించాడు.

మీడియాకి ప్రకటనివ్వడం దండగ..

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడం.. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం.. ఇదంతా దండగ.. అని కొత్త పంచాయితీ తెరపైకి తెచ్చాడు దిల్ రాజు. మీడియా ఏమీ సినిమా ప్రకటనల మీద ఆధారపడదు. కాకపోతే, అవి మీడియాకి కొంతమేర ఉపయోగపడతాయి.

మీడియాలో సినిమాని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి.? సినిమాలకి హైప్ ఎలా తీసుకురావాలి.? అన్న కోణంలో నానా రకాల స్టంట్లూ చేసి, మీడియాతో పొగిడించుకున్న దిల్ రాజు, ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించేశాడు.

తమిళనాడులో విజయ్ సినిమా ‘వారిసు’కి అవసరమైన థియేటర్ల కోసం అడుక్కోవాల్సి వస్తోందంటూ దిల్ రాజు చెబుతుండడం మరో ఆసక్తికరమైన అంశం. అంటే, తెలుగునాట నిర్మాతలు, దిల్ రాజుని తమ సినిమాల విడుదల కోసం థియేటర్ల విషయమై అడుక్కోవాలన్నమాట.

‘ఇది వ్యాపారం..’ అంటూ దిల్ రాజు మొహమాటం లేకుండా చెబుతున్నాడు. ‘దిల్’ రాజు కంటే గొప్ప నిర్మాతలు చాలామంది వున్నారు సినీ పరిశ్రమలో. కానీ, దిల్ రాజు.. తెలుగు సినిమా తీరు తెన్నుల్ని అడ్డగోలుగా మార్చేశాడు. అదే అసలు సమస్య. ఆ చాణక్యం ఎవరికీ చేతకాలేదు ఇన్నాళ్ళూ.!

థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్.. ఇలా అన్నీ తన చేతిలో వున్నాయన్న అహంకారం.. దర్శకులు, నటీనటుల డేట్స్ తన వద్ద లాక్ అయిపోయాయన్న అహంకారం.. ఇవే దిల్ రాజుతో ఇలా మాట్లాడిస్తున్నాయని అనుకోవచ్చా.?

తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల్ని, తన డబ్బింగ్ సినిమాతో దిల్ రాజు సవాల్ చేస్తున్నాడు. అంటే, తెలుగు సినిమా పట్ల దిల్ రాజుకి వున్న గౌరవం ఏంటన్నది అర్థమైపోవట్లే.? ఔను, దిల్ రాజు జస్ట్ వ్యాపారస్తుడంతే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...