Switch to English

అవతార్ 2 రివ్యూ: కనుల విందు

Critic Rating
( 3.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,465FansLike
57,764FollowersFollow

జేమ్స్ కామెరూన్ నుండి ఇప్పటికే మనం ఎన్నో మరపురాని చిత్రాలను చూసాం. ఆయన నుండి 13 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్. ఇప్పటికీ హాలీవుడ్ లో హయ్యస్ట్ గ్రాసింగ్ చిత్రంగా అవతార్ ఉంది. ఎన్నో భారీ చిత్రాలు వచ్చినా ఆ ప్లేస్ అలాగే పదిలంగా ఉంది. మరి ఇన్నేళ్ల తర్వాత అవతార్ కు సీక్వెల్ వస్తోంది. అవతార్ కలెక్షన్స్ ను దాటే దమ్ము, అవతార్ 2 కు ఉందా?

కథ:

జేక్ సల్లీ మరియు తన పార్ట్నర్ నేయిత్రిల కథ అవతార్ నుండి కొనసాగింపుగా ఉంటుంది. పండోరా అడవుల్లో వీరిద్దరూ తమ నలుగురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంటుంది కానీ స్కై పీపుల్ గా పేర్కొనబడే మనుషులు మళ్ళీ తిరిగొస్తారు.

తమ వాళ్ళను కాపాడుకోవడానికి జేక్, తన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? స్కై పీపుల్ నుండి పండోరా గ్రహాన్ని కాపాడుకుంటారా?

నటీనటులు:

సామ్ వర్తింగ్టన్ ఈ చిత్రంలో జేక్ సల్లీ పాత్రలో కనిపిస్తాడు. పండోరా గ్రహ వాసులను భవిష్యత్తు దిశగా నడిపించే బాధ్యతను తీసుకుంటాడు. ఈ చిత్రంలో తన పాత్రతో ముడిపడ్డ ఎమోషన్ ను చక్కగా పలికించగలిగాడు. ఇక తండ్రి పాత్రలో చాలా బాధ్యతగా కనిపిస్తాడు.

నేయిత్రి పాత్రలో జో సల్దానా ఈ సీక్వెల్ లో తల్లి పాత్రలో కనిపిస్తోంది. మొదటి భాగం తాలూకు పాత్రే అయినా కూడా జో ఇందులో ఇంకా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది.

మొదటి భాగంలో చనిపోయాడు అనుకున్న స్టీఫెన్ లాంగ్, రెండో భాగంలో కూడా విలన్ గా తిరిగొస్తాడు. పాత్ర పరంగా మొదటి భాగానికి, దీనికి పెద్దగా మార్పులేం లేవు. డా. గ్రేస్ కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. సెకండ్ పార్ట్ లో ఆమె పాత్ర కచ్చితంగా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అవతార్ నుండి రాబోయే సీక్వెల్స్ కు ఈమె పాత్ర కీలకం. ఇక సెకండ్ పార్ట్ లో జేక్ పిల్లలు అందరూ కూడా బాగా రాణించారు.

సాంకేతిక వర్గం:

జేమ్స్ కామెరూన్ ఈ చిత్రం కోసం నేల విడిచి సాము చేయలేదు. మొదటి భాగం తీరులోనే రెండో భాగంలో కూడా ఎమోషన్, ప్రతీ ఫ్రేమ్ ను అందంగా మలచడంపైనే ఫోకస్ పెట్టాడు. అవతార్ 2 కథ చాలా సింపుల్. మరోసారి పెను ప్రమాదాన్ని పండోరా వాసులు ఎలా ఎదుర్కొన్నారు అన్నది కథాంశం. ప్రతీ పాత్రను హ్యాండిల్ చేసిన విధానం, ఆ పాత్ర తాలూకూ ఎమోషన్ ను డీల్ చేయడం జేమ్స్ కామెరూన్ బ్రిలియన్స్ ను తెలియజేస్తుంది.

జేమ్స్ కామెరూన్ తర్వాత సీక్వెల్స్ కు ఈ చిత్రంతో రంగం సిద్ధం చేసుకున్నాడనే చెప్పాలి. అవతార్ 2 కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ పాత్రా ఫీల్ అవుతోంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా మనం కూడా ఫీల్ అవుతాం.

ఇక ఈ సీక్వెన్స్ లో విజువల్స్ మెయిన్ హైలైట్. ఇందులో వచ్చే వాటర్ విజువల్స్ మనల్ని అబ్బురపరుస్తాయి. సినిమాటోగ్రఫీ ఒక అద్భుతం. మనం నిజంగానే వేరే గ్రహానికి వెళ్ళామా అన్నట్లు ఉంటాయి. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ కూడా బాగానే అనిపిస్తాయి. అయితే రన్ టైమ్ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది.

ప్లస్ పాయింట్స్:

  • పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • విజువల్స్

మైనస్ పాయింట్స్:

  • రన్ టైమ్
  • అక్కడక్కడా ల్యాగ్ అనిపించే సన్నివేశాలు

విశ్లేషణ:

అవతార్ మొదటి భాగం మీకు నచ్చినట్లైతే రెండో భాగం మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇది కేవలం థియేటర్లలోనే, మంచి సౌండ్ అండ్ విజువల్ క్వాలిటీ ఉన్న థియేటర్లలోనే చూడాల్సిన సినిమా. మిస్ కావొద్దు.

తెలుగుబులెటిన్ రేటింగ్: 3/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...