Switch to English

‘వారాహి’కి రిజిస్ట్రేషన్ అయిపోయింది.! ఫాఫం వైసీపీ పరిస్థితేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

మీకు తెలుసా.? ‘వారాహి’ వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయిపోయింది. ఛత్.! ఆ ఛాన్సే లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ జరగదు.! ఇది వైసీపీ నాయకుల అత్యుత్సాహం. ఏపీకి చెందిన రావాణా శాఖ అధికారి ఒకరు కూడా, వారాహి వాహనానికి రిజిష్ట్రేషన్ జరగదని తేల్చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి, ‘వారాహి’ వాహనానికి ఉపయోగించిన రంగు మీద జరిగిన రచ్చ ఓ నిదర్శనం మాత్రమే.

ఓ వాహనం రంగు గురించి మాట్లాడే స్థాయికి వైసీపీ మంత్రులు ఎందుకు దిగజారిపోయారు.? ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు, రాజధాని.. వీటి గురించి కదా మంత్రులు మాట్లాడాల్సింది.?

పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ పెడితే చాలు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు వైసీపీ నేతలు మీడియా ముందుకి. మొన్నీమధ్యనే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించిన ఫొటో పెడితే, వైసీపీ నేతలు గిలగిలా కొట్టుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌కీ మారిటల్ ఆర్ట్స్‌కీ తేడా తెలియకుండా స్పందించారో మంత్రిగారు. ఇదీ వైసీపీ నాయకులకున్న అవగాహన.

అన్నట్టు, ‘వారాహి’ వాహనానికి రిజిస్ట్రేషన్ వారం రోజుల క్రితమే అయిపోయింది. ‘వారాహి’ వాహనాన్ని జనసేన అధినేత సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన రోజునే అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయట. కాకపోతే, రిజిస్ట్రేషన్ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిందంతే.

ఆలివ్ గ్రీన్ కలర్ అన్నారు.. ప్చ్.. బహుశా కలర్ బ్లైండ్‌నెస్ వుండి వుంటుంది వైసీపీ నేతలకి.! అది ఆలివ్ గ్రీన్ కాదు, ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ ఆర్టీయే అధికారులు తేల్చారు. వాహనానికి ఎలాంటి సమస్యలూ రిజిస్ట్రేషన్ పరంగా లేవనీ, ఏవన్నా అదనపు మార్పులు జరిగితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆర్టీయే అధికారులు చెప్పారు. తెలంగాణలో వాహనం రిజిస్ట్రేషన్ జరిగింది.

మరి, ఏపీలోని అధికార పార్టీకి ‘వారాహి’ రంగు ఆలివ్ గ్రీన్‌లా కనిపిస్తేనో.? రోడ్ల మీద తిరగకుండా ఏమైనా ఆంక్షలు వైసీపీ విధించగలుగుతందా.? కోడి గుడ్డు మీద ఈకలు పీకే వ్యవహారాన్ని వైసీపీ ఇకనైనా మానుకుంటుందేమో వేచి చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...