Switch to English

వారాహి వర్సెస్ గొడ్డలి.! దేన్ని చూసి జనం ఓట్లేస్తారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

రాజకీయ పార్టీలకు చెందిన అధికార ప్రతినిధులకు వాగ్ధాటి అవసరం. కొందరు పెద్ద గొంతేసుకుని అరిచేస్తుంటారు. ఇంకొందరు పాయింట్ పట్టుకుని మాట్లాడుతుంటారు. వైసీపీ అధికార ప్రతినిథి వెంకటరెడ్డి, అడ్డగోలుగా వాదించడంలో దిట్ట. ఆయనకు ప్రతిసారీ తనదైన స్టయిల్లో కౌంటర్ ఎటాక్ ఇస్తుంటారు జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ.

తాజాగా ‘వారాహి’ విషయమై ఓ న్యూస్ ఛానల్‌లో చర్చ సందర్భంగా ‘ప్రచార రధాన్ని చూసి.. అందాన్ని చూసి.. కత్తుల్ని చూసి ఓట్లెయ్యరు..’ అంటూ వెంకటరెడ్డి సెటైర్ వేశారు. జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ కూడా ఘాటుగానే స్పందించారు.

‘మరి, దేన్ని చూసి ఓటేస్తారు.? గొడ్డలి పోటుని చూసి ఓట్లేస్తారా.? కోడి కత్తి గాటుని చూసి ఓటేస్తారా.?’ అంటూ రాయపాటి అరుణ కౌంటర్ ఎటాక్ ఇచ్చేసరికి, వైసీపీ అధికార ప్రతినిథి వెంకటరెడ్డికి సౌండ్ లేకుండా పోయింది.

ఒక్కటి మాత్రం నిజం. ఓ కోటి రూపాయలు ఖర్చు చేసి, ‘వారాహి’ వాహనం గురించి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్పుకుంటే వచ్చే పబ్లిసిటీ, జనసేన పార్టీకి ఉచితంగానే వచ్చింది.. అదీ వైసీపీ కారణంగా. ముఖ్యమంత్రి తప్ప, ‘వారాహి’ గురించి దాదాపుగా వైసీపీ ముఖ్య నేతలంతా మాట్లాడేశారు.

మంత్రులు కొందరు రివ్యూలు ఇచ్చేశారు. ఇంకొందరైతే మోటారు వాహనాల చట్టం గురించి వివరణాత్మకంగా చెప్పేశారు. చిత్రమేంటంటే, వైసీపీ నాయకుల్లో చాలామంది మోటారు వాహనాల చట్ట నిబంధనలు పట్టకుండా తమ సొంత కార్లను నడుపుతున్నారు. ఆయా నేతల కార్ల నెంబర్ ప్లేట్లను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

ఏదిఏమైనా, ‘వారాహి’ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. కంటెంట్ వున్నోడి కటౌట్ చాలు.. అంటూ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఓ డైలాగ్ వుంటుంది ‘గబ్బర్ సింగ్’ సినిమాలో.

పవన్ కళ్యాణ్ ఫొటో, పవన్ కళ్యాణ్ వాహనం.. వాట్ నాట్.. అన్నటికీ విపరీతమైన ఫాలోయింగ్. జనసేన పార్టీకి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడానికి విలువైన చాలా సమయాన్ని వృధా చేసుకునే మంత్రులున్నారంటే.. దటీజ్ పవన్ కళ్యాణ్.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...