Switch to English

యాక్షన్ కింగ్ సినిమా నుండి మాస్ కా దాస్ వాకౌట్.. ఏమౌతుందో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఫలక్‌నుమా దాస్ వంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో, ఈయేడాదిలో ఇప్పటికే అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా వంటి రెండు వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయినా, కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈ హీరో ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.

ఇక ఈ హీరో తన స్వీయ డైరెక్షన్‌లో గామి, దాస్ కా ధమ్కీ అనే రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. అర్జున్ సర్జా దర్శకుడిగా, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి విశ్వక్ సేన్ వాకౌట్ చేశాడు. దీంతో అర్జున్ తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కొంతమేర షూటింగ్ జరుపుకున్న సినిమా నుండి ఇలా విశ్వక్ సేన్ వాకౌట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. చూడబోతే, ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి అర్జున్ సర్జా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి విశ్వక్ సేన్ ఎందుకు వాకౌట్ చేశాడు.. ఒకవేళ విశ్వక్ ఈ సినిమా నుండి పూర్తిగా తప్పుకుంటే, అర్జున్ ఈ సినిమా కోసం ఎవర్ని హీరోగా పట్టుకొస్తాడో చూడాలి.

5 COMMENTS

  1. 696311 670573Youre so cool! I dont suppose Ive read anything such as this before. So good to get somebody with some original thoughts on this subject. realy we appreciate you starting this up. this fabulous website are some items that is required on the internet, somebody with slightly originality. beneficial function for bringing a new challenge on the world wide internet! 702027

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...