Switch to English

ప్రాంతీయ దేవుడంట.! ఇదెక్కడి మాస్‌రా మావా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సోషల్ మీడియాలో ఈ మధ్య తరచూ ‘ఇదెక్కడి మాస్‌రా మావా..’ అనే మాట వినిపిస్తోంది. ర్యాగింగ్ చేయడానికైనా, పొగిడేందుకోసమైనా ఈ మాటని నెటిజన్లు బాగా వాడేస్తున్నారు. రాజకీయ నాయకులకు సంబంధించి, వారి వ్యాఖ్యలపైనా ‘ఇదెక్కడి మాస్‌రా మావా..’ అనడం సర్వసాధారణమైపోయింది. తాజాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అరసవెల్లి దేవస్థానం విషయమై ‘ప్రాంతీయ దేవుడు’ అనే భావం వచ్చేలా మాట్లాడటంపై ‘ఇదెక్కడి మాస్‌రా మావా..’ అంటూ చర్చ షురూ అయ్యింది.

‘ఇది కదా కావాల్సింది..’ అంటూ వైసీపీ శ్రేణులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నాయి. పాజిటివ్‌గా ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, మెజార్టీ నెటిజన్లు మాత్రం, ‘ఇదెక్కడి మాస్‌రా మావా..’ అంటూ వెటకారం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై.

‘ఆ ప్రాంత దేవుడ్ని మీ ప్రాంతంలో అభివృద్ధి వద్దు.. రాజధాని వద్దు.. అమరావతిలోనే రాజధాని, అభివృద్ధి కావాలని ఎలా అడుగుతారు అధ్యక్షా.? ఉత్తరాంధ్ర ప్రజలు గమ్మునుండాలా.? వారికి భావోద్వేగాలు వుండవా.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

అసలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరు స్క్రిప్ట్ అందిస్తున్నారు.? అన్న అనుమానం ఇలాంటి సందర్భాల్లోనే కలుగుతుంటుంది. తెలంగాణ ఉద్యమం కోసం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని మొక్కుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ మొక్కులు తీర్చుకున్నారు కూడా.

దేవుడికి కులం, ప్రాంతం అనేవి వుంటాయా.? అరసవెల్లి సూర్యనారాయణస్వామి అంటే, ఉత్తరాంధ్ర దేవుడు మాత్రమేనా.? తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి అంటే రాయలసీమ దేవుడు మాత్రమేనా.? కనకదుర్గమ్మ అంటే కేవలం బెజవాడకు మాత్రమే పరిమితమా.? ఎక్కడికి పోతున్నాయ్ మన ఆలోచనలు.?

రాజధాని అమరావతిలో వుంటే ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయట. విశాఖలో రాజధాని పెడితే, శ్రీకాకుళం ప్రజల మనోభావాలు దెబ్బ తినవా.? అసలేంటీ రాజకీయం.? అసలు ఎటు పోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.? రాజధాని అమరావతి కోసం రైతులు భూములిచ్చారంటే దానర్థం, రాష్ట్రంలోని ఆరు కోట్ల ప్రజలకు సంబంధించినది. రాష్ట్రం కోసం అమరావతి రైతులు భూములిచ్చారు. శ్రీకాకుళం ప్రజల కోసం, చిత్తూరు ప్రజల కోసం.. ఇలా అన్ని జిల్లాల్లోని ప్రజల కోసం ఉపయోగపడే రాజధాని అది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తనకు అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాదని పరోక్షంగా ఒప్పేసుకున్నారు. 30 లక్షల కోట్లు ఖర్చు, వందేళ్ళ సమయం.. అంటూ కాకమ్మ కథలు చెప్పారు. సరే, ఆయన విజ్ఞత అంతే. అలాగే చెప్పేసి ఊరుకుంటే పోయేది. మధ్యలో ఈ ప్రాంతీయ దేవుళ్ళు, ఉత్తరాంధ్ర మనోభావాలు.. ఎందుకొచ్చిన తంటా.? ఆ లెక్కన రాయలసీమ ముఖ్యమంత్రి కారణంగా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినాలి. వున్నపళ:గా ఉత్తరాంధ్రకీ ఓ ముఖ్యమంత్రి వుండాల్సిందే కదా.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...