Switch to English

సీపీఎస్ రద్దు: డబ్బుల్లేవ్.. మేమేటి సేత్తాం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి, ఆ తర్వాత మాట తప్పాల్సి వస్తే.. పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్ళిపోవాలని చెప్పింది స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారే. అది ప్రతిపక్ష నేతగా వున్నప్పటి మాట. అధికార పీఠమెక్కాక మాత్రం మాట తప్పేశారు. సీపీఎస్ రద్దు విషయంలో, ‘అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే చేసేస్తాం..’ అని హామీ ఇచ్చిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక మూడేళ్ళయినా.. ఆ పని చేయలేదు సరికదా, ‘అప్పుడేదో తెలియక చెప్పేశాం.. ఇప్పుడు చేయలేం..’ అంటున్నారు.

‘మేం చేయగలిగే పరిస్థితి వుంటే చేసేవాళ్ళం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టకుని చేయలేకపోతున్నాం.. ఉద్యోగులు అర్థం చేసుకోవాలి..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీపీఎస్ రద్దు వ్యవహారంపై తాజాగా వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో అవగాహన లేకుండా హామీ ఇచ్చారు..’ అంటూ సీపీఎస్ మీద తొలుత బాంబు పేల్చింది సజ్జల రామకృష్ణారెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

అదేంటో, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విషయంలోనే రాష్ట్రానికి వున్న ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వ పెద్దలకు గుర్తుకొస్తున్నాయ్. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడేమో ఆర్థిక ఇబ్బందులు గుర్తుకు రావడంలేదాయె.!

ఎడా పెడా సలహదారుల్ని నియమించుకున్నాక, వారికి గౌరవ వేతనాలతోపాటు సకల సౌకర్యాలూ కల్పించేందుకు పెద్దయెత్తున నిధులు ఖర్చు చేసినప్పుడు మాత్రం రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు వైసీపీ అధినాయకత్వానికీ, ప్రభుత్వ పెద్దలకూ గుర్తుకు రాలేదాయె. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తరఫున ప్రచారం నిమిత్తం చేసే ఖర్చు విషయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వంలో వున్నవారికి గుర్తుకు రాకపోవడం శోచనీయమే.!

కేవలం, ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి.. అందునా సీపీఎస్ రద్దు దగ్గరకు వచ్చేసరికి మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వ పెద్దలకు ఒకింత గుర్తుకొచ్చేస్తున్నాయ్.. ఈ ఒక్క విషయంలోనే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించేస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.

ప్రభుత్వ ప్రకటనల పేరుతో సొంత మీడియా సంస్థలకు చేస్తున్న మేలుని రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆపగలరా.? అన్నది ప్రభుత్వ ఉద్యోగుల ప్రశ్న. తూచ్.. అలాంటి ప్రశ్నలు ఉద్యోగులెవరూ వెయ్యకూడదు.. అది ప్రభుత్వ వ్యతిరేక చర్య అవుతుంది.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...