Switch to English

అంశం ఏదైనా.. రంగు పడాల్సిందే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాజకీయాలకూ దీనిని వర్తింపజేయొచ్చనిపిస్తోంది. ఏ అంశం దొరుకుతుందా.. దానికి రాజకీయ రంగు పులుముదామా అని చూడటం ఎక్కువైపోయింది. తాజాగా టీమిండియా జెర్సీ రంగుపైనా కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు మొదలుపెట్టాయి. ఆ రంగు వెనుక బీజేపీ ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

ప్రధాని మోదీ దేశం మొత్తాన్ని కాషాయమయం చేస్తున్నారని దుయ్యబడుతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ లో ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకూ ఒక ప్రత్యేకమైన జెర్సీ ఉంటుందన్న విషయం కూడా మనకు తెలుసు. టీమిండియా జట్టు జెర్సీ బ్లూ కలర్లో ఉంటుంది. అందుకే మన జట్టుకు మెన్ ఇన్ బ్లూ అని కూడా పేరుంది. ఇంగ్లండ్ జట్టు జెర్సీ కూడా నీలమే. మనది ముదురు నీలం అయితే, వారిది లేత నీలం రంగు. టోర్నీలో భాగంగా ఈనెల 30న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు జెర్సీ రంగు మార్చుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సూచించింది.

ఆతిథ్య జట్టు అయిన ఇంగ్లండ్ కు వారి జెర్సీతోనే ఆడేందుకు అనుమతి ఇచ్చిన ఐసీసీ.. టీమిండియా మాత్రం మరో రంగు జెర్సీలో బరిలోకి దిగాలని పేర్కొంది. టోర్నీ ఆరంభానికి ముందే ప్రతి జట్టూ రెండు రకాల జెర్సీలతో రావాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కూడా తమ రెగ్యులర్ జెర్సీతో పాటు ఆరెంజ్ కలర్ జెర్సీతో టోర్నీకి వెళ్లింది. సరిగ్గా ఇక్కడే రాజకీయం మొదలైంది. కాషాయ రంగులో ఉన్న ఆ జెర్సీ వెనుక బీజేపీ ఉందంటూ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు యాగీ చేస్తున్నాయి.

ఎస్పీ ఎమ్మెల్యే అబు అసీమ్‌ అజ్మి మీడియాతో మాట్లాడుతూ.. దేశం మొత్తం కాషాయీకరణ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. జెండాలో మూడు రంగులు ఉంటే ఆరెంజ్‌ను మాత్రమే ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎన్డీఏ పక్షాలు తోసిపుచ్చాయి.

ఆ రంగు ధైర్యానికి, విజయానికి ప్రతీక అని, దీనిపై ఎవరికీ ఎటువంటి సమస్య ఉండకూడదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్ష పార్టీలకు ఏ విషయమూ కనపడట్లేదని అందుకే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని శివసేన విరుచుకుపడింది. కాగా, జెర్సీని ఎంచుకునే స్వేచ్ఛ ఆయా జట్ల ఆటగాళ్లదేనని, ఇందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని ఐసీసీ స్పష్టంచేసింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...