Switch to English

కరకట్టను ఖాళీ చేయించడం ఖాయమే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వివాదాలకు, రాజకీయ రగడకు కేంద్ర బిందువుగా నిలిచిన విజయవాడ ఉండవల్లిలోని కరకట్టను ఖాళీ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును వేధించేందుకే ప్రజావేదికను కూల్చివేశారంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అధికార పార్టీ కదులుతోంది. చంద్రబాబు ఉంటున్న నివాసం ఒక్కటే తమ లక్ష్యం కాదని, కరకట్టపై ఉన్నవాటినే కాకుండా రాష్ట్రంలో అక్రమంగా ఉన్న అన్ని నిర్మాణాలనూ ఇలాగే తొలగిస్తామని స్పష్టంచేస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో రూ.8.9 కోట్ల వ్యయంతో కృష్ణా నది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదికను నిర్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కలెక్టర్ల సమావేశం అందులోనే ఏర్పాటు చేసిన సీఎం జగన్.. ఆ భేటీ ముగిసిన వెంటనే దాన్ని కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అధికారులు దాని కూల్చివేత ప్రారంభించారు. అయితే, తమ అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటిని కూల్చాలనే ఉద్దేశంతోనే జగన్ సర్కారు ముందుగా ప్రజావేదికను కూల్చివేసిందంటూ టీడీపీ గగ్గోలు చేయడం మొదలుపెట్టింది.

అక్రమ నిర్మాణాలను తొలగించడం పెద్ద అక్రమం అంటూ ధ్వజమెత్తింది. కరకట్టపై తమ అధినేత నివాసం ఒక్కటే కాకుండా చాలా నిర్మాణాలు ఉన్నాయని.. వాటిని కూడా తొలగిస్తారా అంటూ ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. కరకట్టపై అక్రమంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి వాటి యజమానులకు సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఈ భనవాలను కూల్చివేయనున్నామని, వెంటనే వాటిని ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించాలని అందులో కోరింది.

మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్డీఏ చైర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యతో తెలుగుదేశం పార్టీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను సర్కారు కూల్చివేస్తుండటంపై నానా రభస చేద్దామని భావించిన ఆ పార్టీకి తాజా పరిణామాలు మింగుడుపడటంలేదు. కరకట్టపై ఉన్న ప్రతి అక్రమ కట్టడాన్ని తొలగిస్తామని సర్కారు స్పష్టంచేయడంతో టీడీపీ టోన్ మారింది.

కరకట్టపై నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు కాబట్టే, అక్కడి నిర్మాణాలను కూల్చివేస్తున్నారని.. లేకపోతే అసలు ఈ అంశాన్ని పట్టించుకునేవారా అని ప్రశ్నిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్న అక్రమ కట్టడాలనూ తొలగిస్తారా అంటూ ప్రశ్నలు గుప్పిస్తోంది. తొలుత కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల గురించి మాట్లాడిన టీడీపీ.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అంటోందని.. రేపు దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతుందేమో అంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....