Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ‘అభిలాష’లో లాయర్ పాత్రలో జీవించిన చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమాల్లో హీరో చూపించే హీరోయిజం, మేనరిజం, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ.. వారికి క్రేజ్ తీసుకొస్తుంది.. అభిమానులను సంపాదిస్తుంది.. ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది. అయితే.. హీరో అంటే మాస్, క్లాస్, భావోద్వేగం, ఉత్తేజపరిచే పాత్రలు కూడా చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని కథాంశాలు ఎంచుకోవాలి. అయితే.. వారికున్న క్రేజ్, ఇమేజ్ దృష్ట్యా కొన్ని కథలను చేయలేరు. ఇదే కోవలో చిరంజీవి అప్పటివరకూ తాను టచ్ చేయని ఓ ప్రయోగాత్మక కథను చేశారు. సమాజంపై ప్రభావం చూపి.. ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించే ఓ కథను చిరంజీవి చేసి సూపర్ హిట్ అందుకున్నారు. తన నటనతో ప్రేక్షకాభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఆ సినిమా ‘అభిలాష’. హీరోయిజం లేకుండా కేవలం కథ, కథనంపై నడిచే సినిమా ఇది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్:  ‘అభిలాష’లో లాయర్ పాత్రలో జీవించిన చిరంజీవి

 

ప్రయోగాత్మక సినిమా..

న్యాయవాదిగా న్యాయవ్యవస్థను ప్రశ్నించే ఓ లాయర్ కథ. ‘ఉరిశిక్ష రద్దు చేయాలి.. మనిషికి జీవించే హక్కు ఉండాలి’ అనే అంశాన్ని కోర్టుకు వివరించే క్రమంలో.. తానే అనుకోకుండా కేసులో ఇరుక్కుని అదే ఉరిశిక్షకు గురవుతాడు. ఈక్రమంలో తాను అనుభవించే మానసిక వ్యధను లాయర్ చిరంజీవి పాత్రలో చిరంజీవి జీవించారు. సినిమాలో పాత్రలా కాకుండా చిరంజీవికే తర్వాత సన్నివేశంలో ఏమవుతుంది.. ఉరిశిక్ష పడుతుందా అనేంతలా ప్రేక్షకులు లీనమైపోయారు. కథ, కథనంలో ఉన్న పట్టును తెరపై చిరంజీవి చేసి చూపించారు. తన పాత్రలోని ఆవేశం, అనుకున్నది సాధించాలనే పట్టుదల, కొన్నిచోట్ల అమాయకత్వం.. కేసులో ఇరుక్కున్న తర్వాత నిస్సహాయ స్థితిలో చూపిన భావోద్వేగం ప్రేక్షకులను కట్టి పడేసింది.

 

విమర్శకుల ప్రశంసలు పొంది..

అప్పటికి చిరంజీవికి అయిదేళ్ల సీనియారిటీ, 50కి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉంది. అయితే.. కుర్రాడిలా, విలన్, హీరో, ఆకతాయిగా, మాస్, క్లాస్ పాత్రల్లో చేసిన చిరంజీవికి ఒక ప్రయోగాత్మక సినిమా చేయడం ఇదే ప్రధమం. మెరుపు వేగంతో చిరంజీవి చేసే డ్యాన్సులు, ఫైట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చిరంజీవి ఈ సినిమా చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. చిరంజీవి నటనకు ప్రేక్షకాభిమానుల ప్రశంసలే కాదు.. విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ రాసిన ‘అభిలాష’ నవల ఆధారంగా సినిమా తెరకెక్కింది. నవల చదివి చిరంజీవి తల్లి అంజనా దేవి ఈ కథను సినిమా చేయాలని హీరోగా నటించాలని చిరంజీవిని కోరారట. యండమూరి నవలలు సినిమాగా రావడం ఇదే మొదటిసారి.

‘అభిలాష’లో లాయర్ పాత్రలో జీవించిన చిరంజీవి*

చిరంజీవి మెరుపు వేగం..

అప్పటికి తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడం, రేడియో పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న కెఎస్ రామారావు ఈ సినిమా నిర్మించారు. చిరంజీవితో అప్పటికే హిట్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. మద్రాసులో ప్రివ్యూకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. 1983 మార్చి 11న సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిసింది. ఇళయరాజా సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్లే. సందెపొద్దుల కాడ.. పాటలో కొంత చిరంజీవే స్వయంగా డ్యాన్స్ కంపోజ్ చేసుకున్నట్టు కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నవ్వింది మల్లెచెండు పాటలో చిరంజీవి చూపిన ఎనర్జీ ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. చిరంజీవి కెరీర్లో మరో 100 రోజుల సినిమాగా నిలిచింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...