Switch to English

రైతన్న కష్టం అమ్మకి తెలుసు: జనసేనానికి విరాళమందించిన అంజనాదేవి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మాతృదేవోభవ.! అమ్మకంటే ఈ లోకంలో ‘కష్టం’ ఇంకెవరికి తెలుస్తుంది.? కౌలు రైతుల కష్టాలకు చలించిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘కౌలు రైతు భరోసా’ పేరుతో, అన్నదాతల కుటుంబాలకు సాయమందిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతుల దీనగాధ జనసేనానిని కదిలించింది. వారి కుటుంబాలను ఆదుకునేందుకు నడుం బిగించారు. ఒక్కో కుటుంబానికీ లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ సాయంపైనా రాజకీయ ప్రత్యర్థులు తమ దిగజారుడుతనం ప్రదర్శిస్తూ, జనసేనానిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మెగా కాంపౌండ్ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఇప్పటికే జనసేన కౌలు రైతు భరోసా కోసం విరాళాలు అందించగా, తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి కూడా తనవంతు సాయంగా లక్షన్నర రూపాయల విరాళం అందించారు.

పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకట్రావు, అబ్కారీ శాఖలో ఒకప్పుడు ఉద్యోగం చేశారు. ఆయన మరణానంతరం, పెన్షన్ వస్తూ వుంది. ఆ పెన్షన్ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం అంజనా దేవి వినియోగిస్తున్నారు. అలా ఈసారి జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమం కోసం అంజనా దేవి లక్షన్నర రూపాయల్ని విరాళంగా ఇచ్చారు. మరోపక్క, పార్టీ కోసం కూడా లక్ష రూపాయల విరాళం అందించారు అంజనాదేవి.

రాజకీయమంటే దిగజారుడుతనంతో కూడిన విమర్శలేనని అధికార వైసీపీ అనుకుంటోంది. ‘పవన్ కళ్యాణ్, కౌలు రైతులకు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు..’ అంటూ దిగజారి విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. నిజానికి, కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం, ప్రభుత్వ ఖజనానా నుంచి సొమ్ములు వెచ్చించి, రైతుల్ని ఆదుకోవాల్సి వుండగా, ఆ బాధత్యని ప్రభుత్వంలో వున్నవారు విస్మరించారు.

ఈ నేపథ్యంలో తన కష్టార్జితం నుంచి కోట్ల రూపాయలు వెచ్చించి మరీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘జనసేన కౌలు రైతు భరోసా నిధి’ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా, ఆ నిధికి విరాళాలు అందిస్తుండడం అభినందించదగ్గ విషయం.

ఏమో, రేప్పొద్దున్న వైసీపీ నుంచి మంత్రులు, ముఖ్య నేతలు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి మీద కూడా అడ్డగోలు విమర్శలు చేస్తారేమో.! ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే కదా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...