Switch to English

బులుగు ఆవేదన: గడప గడపకీ చీవాట్లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘కాలర్ ఎగరేసుకుని మరీ జనంలోకి వెళ్ళి చెప్పండి.. సంక్షేమ పథకాలు ఘనంగా అమలు చేస్తున్నామని..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులకు మొన్నామధ్యన క్లాస్ తీసుకున్నారు.

‘గడప గడపకీ మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ ఘనంగా ఓ పబ్లిసిటీ స్టంట్ షురూ చేసింది. అధినేత మాటని కాదనగలరా.? ఎదురు చెప్పగలరా.? వెళితే ఏమవుతుందో తెలిసీ, ఏమీ చేయలేని దుస్థితి వైసీపీ ప్రజా ప్రతినిథులది. వెళుతున్నారు జనంలోకి, చీవాట్లు తింటున్నారు కూడా.

అరువు తెచ్చుకున్న ‘పెయిడ్ ఆర్టిస్టుల’ కారణంగా బీభత్సమైన భజన జరుగుతున్నా, సాధారణ ప్రజానీకం నుంచి నిలదీతలు తప్పడంలేదు. గడప గడపకీ నిలదీతలే. మంత్రుల, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా అందరిదీ దాదాపు అదే పరిస్థితి.

‘పెన్షన్లు ఎవరిస్తున్నారు.?’ అని ప్రశ్నిస్తే, ‘వాలంటీర్ తెచ్చి ఇస్తున్నారు..’ అంటున్నారు జనం. ‘జగనన్న ఇచ్చారని చెప్పండి..’ అంటోంటే, ‘జగన్ ఏంటి.? చంద్రబాబు ఏంటి.? అప్పులు చేసి కదా, మాకు పంచుతున్నది.. మీరెంత తినేస్తున్నారు.?’ అంటూ జనం నిలదీస్తున్నారు.

అంతేనా, ‘నువ్వే మా భూమిని కబ్జా చేశావ్..’ అంటూ ఓ ఎమ్మెల్యేని ఓ చోట నిలదీస్తే, ‘కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచావ్.?’ అని మరో ఎమ్మెల్యేని ఇంకో చోట నిలదీస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. ‘ఉక్రెయిన్’ యుద్ధానికీ, కరెంటు ఛార్జీలకీ లింకులు పెడుతున్నారు కొందరు వైసీపీ ప్రజా ప్రతినిథులు అతి తెలివిగా.

చెత్త పన్ను ఏంటి.. చెత్త రాజకీయం కాకపోతే.? అంటూ, కొందరు జనం చిత్తు చిత్తుగా వైసీపీ ప్రజా ప్రతినిథుల్ని నిలదీస్తున్నారు. ఇంతలా నిలదీతలు ఎదురవుతోంటే, పాపం వైసీపీ ప్రజా ప్రతినిథులు మాత్రం ఎంతవరకు భరించగలరు.? భరించలేక మాట మీద అదుపు కోల్పోతున్నారు. జనాన్ని తిడుతున్నారు. ‘అరెస్టు చేసెయ్యండి వాడ్ని..’ అంటూ పోలీసుల్ని ఆదేశిస్తున్నారు కూడా.

అధినేత వైఎస్ జగన్, తాడేపల్లి గడప దాటడంలేదాయె.. జనంలోకి వెళితే, రోడ్లకు ఇరువైపులా పరదాలు వుండాలాయె. కానీ, తమకేంటి ఈ దుస్థితి.? అని వైసీపీ ప్రజా ప్రతినిథులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.. అదీ తెరవెనుకే సుమండీ.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...